Kadiyam Kavya : కడియం కావ్యపై ఎన్నికల కమిషన్‌ కు ఫిర్యాదు చేసిన బీఆర్‌ఎస్‌

మున్సిపల్‌ ఎన్నికల్లో భాగంగా మహబూబాబాద్‌ జిల్లా తొర్రూరు మున్సిపాలిటీలో వరంగల్‌ ఎంపీ కడియం కావ్య ఎక్స్‌-అఫీషియో సభ్యురాలిగా  నమోదు చేయించుకోవడం వివాదస్పదమైంది. కావ్య ఇప్పటికే వరంగల్‌ కార్పొరేషన్‌లో ఎక్స్‌-అఫీషియో సభ్యురాలిగా ఉన్నారు.

New Update
FotoJet (10)

BRS files complaint with Election Commission against Kadiyam Kavya

 Kadiyam Kavya : మున్సిపల్‌ ఎన్నికల్లో భాగంగా మహబూబాబాద్‌ జిల్లా తొర్రూరు మున్సిపాలిటీలో  వరంగల్‌ ఎంపీ కడియం కావ్య ఎక్స్‌-అఫీషియో సభ్యురాలిగా  నమోదు చేయించుకోవడం వివాదస్పదమైంది. ఈ మున్సిపాలిటీలో బీఆర్‌ఎస్‌కు పూర్తి మెజారిటీ ఉండగా కాంగ్రెస్‌ ఎంపీ కడియం కావ్య, ఎమ్మె్ల్యే యశస్వినిరెడ్డి లు ఎక్స్‌-అఫీషియో ఓటుతో ఈ స్థానాన్ని కైవసం చేసుకోవాలని ప్రయత్నిస్తున్నారు. అయితే మునిసిపల్‌ చైర్మన్ల ఎన్నిక నేపథ్యంలో  వరంగల్‌ ఎంపీ కడియం కావ్య 2చోట్ల ఎక్స్‌ అఫిషియో సభ్యురాలిగా ఓటు నమోదు చేసుకున్నారని బీఆర్‌ఎస్‌ ఆరోపించింది. బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ నాయకుల ఆందోళనతో ఈ ఎన్నిక నేటిక వాయిదాపడింది. 

కాగా  కాంగ్రెస్‌ ఎంపీ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారని, ఆమెపై చర్యలు తీసుకోవాలని కోరుతూ రాష్ట్ర ఎన్నికల సంఘం(ఎస్‌ఈసీ) కార్యాలయంలో బీఆర్‌ఎస్‌ పార్టీ ప్రతినిధులు కిశోర్‌గౌడ్‌, లలితారెడ్డి ఫిర్యాదు చేశారు. ఎంపీ కావ్య ఇప్పటికే వరంగల్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌లో ఎక్స్‌-అఫీషియో సభ్యురాలిగా ఉన్నారు.  ఇప్పుడు తొర్రూరులో కూడా ఎక్స్‌-అఫీషియో సభ్యురాలిగా నమోదు చేయించుకున్నారన్నారు. దీనిపై బీఆర్‌ఎస్‌ సీరియస్‌ అయింది. ఇది ఎన్నికల నియమావళి ఉల్లంఘన కింద కు వస్తుందని, నిబంధనల ప్రకారం 30 రోజుల ముందే నోటీసు ఇవ్వాల్సి ఉండగా, కేవలం ఒకటి, రెండు రోజుల్లోనే నమోదు పూర్తి చేసి ఓటు వేయడానికి సిద్ధపడటం చట్టరీత్యా చెల్లదన్నారు. ఆమెపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసింది.

Advertisment
తాజా కథనాలు