BRS MLA: కొడంగల్ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి అరెస్ట్ అయ్యారు. ఉదయం కేబీఆర్ పార్కు వద్ద మార్నింగ్ వాక్ చేస్తుండగా పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. కలెక్టర్ పై దాడి కేసులో ఆయనను పోలీసులు అరెస్ట్ చేసినట్లు సమాచారం. కాగా లగచర్ల గ్రామంలో వికారాబాద్ జిల్లా కలెక్టర్ పై చేసిన దాడి కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న సురేష్ అనే బీఆర్ఎస్ కార్యకర్త ఇచ్చిన వాగ్మూలం మేరకే నరేందర్ రెడ్డిని కస్టడీలోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఇటీవల పట్నం నరేందర్ రెడ్డి కూడా సురేష్ బీఆర్ఎస్ కార్యకర్తనే అని.. తాను అతడు ప్రతిరోజూ కాల్ చేస్తాడని చెప్పడం చర్చనీయాంశమైంది. కాగా ఈ దాడి కేసులో ఇప్పటికే పోలీసులు అరెస్టులు షురూ చేశారు.
Also Read: Pawan Kalyan: పవన్ కు మరో కీలక బాధ్యత అప్పగించిన మోదీ!
కొందరు కావాలనే...
ఇదిలా ఉంటే తనపై జరిగిన దాడిపై ఆ జిల్లా కలెక్టర్ స్పందించారు. తనపై దాడి జరిగిన ఘటన పై కలెక్టరేట్ లో ఉద్యోగులు నల్ల బ్యాచ్ పెట్టుకొని నిరసన చేస్తున్న వారిని... నిరసన ఆపాలని అన్నారు. అక్కడ ఉన్నది మన రైతులని.. మన రైతులపై మనం ఎందుకు చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఆయన మాట్లాడుతూ.. "మేము భూసేకరణ అంశంపై లగచర్ల గ్రామస్థుల వద్దకు వెళ్ళమని.. తమని అక్కడికి రమ్మని కొందరు గ్రామస్థులు కోరడం వల్లే అక్కడి వెళ్ళమని.. రైతులు కూడా తమను చర్చించేందుకు స్వాగతించారని.. అదే సమయంలో కొందరు వ్యక్తులు అక్కడి చేరుకొని.. అక్కడ ఉన్న రైతులను రెచ్చగొట్టారని.. ఆ సమయంలో రైతులను ముందుకు తోస్తు.. తమపై దాడి చేసారని.. ఈ దాడుల్లో ప్రభుత్వ వాహనాలు.. కొందరు అధికారులకు స్వల్ప గాయాలు అయ్యాయి.. రైతులు అమాయకులు.. వారు ట్రైబ్స్... వారికి ఇవన్నీ ఏమి తెలియదు.. కానీ కొందరు రెచ్చగొట్టడం వల్లే రైతులు తమపై దాడికి వచ్చారు." అని కలెక్టర్ వివరణ ఇచ్చారు.