/rtv/media/media_files/2025/05/07/xT0GOexQQIAXJ6qXwndn.jpg)
Bride leaves with boyfriend
Suicide : తల్లిదండ్రులు తమ పిల్లలు ఎదిగాక వారికి పెళ్లిళ్లు చేసి ఓ ఇంటి వాళ్లను చేయాలని భావిస్తుంటారు. తమ బాధ్యతగా కొడుకులు, కూతుర్లకు వివాహాలు జరిపిస్తుంటారు. కానీ, ఈ మధ్యకాలంలో ప్రేమించినవారితో లేచిపోవడం సర్వసాధారణమైంది. అయితే తమకు ఇష్టమున్న వారి గురించి తల్లిదండ్రులకు ముందే చెప్పి ఒప్పించి పెళ్లి చేసుకోవడం మంచిది. లేదంటే తనకు పెళ్లి ఇష్టం లేదని చెప్పి ఇష్టమైన వాడితో ముందే వెళ్లిపోవడం ఇంకా ఉత్తమం. కానీ పెళ్లి చూపులు పూర్తయి, ఒకరికొకరు నచ్చారనిపించుకుని తీరా పెళ్లి పీటల మీదకు వెళ్లే సమయంలో లేచిపోవడం రెండు కుటుంబాలకు ఇబ్బంది కలిగించే అంశమే. అలా అయినా పోనీలే అనుకునే కుటుంబాలు ఉంటే ఉండచ్చు. కానీ, నలుగురిలో పరువు కోసం పాకులాడే కొన్ని కుటుంబాలకు ఇది తీరని శోకాన్ని మిగుల్చుతుంది.
ఇది కూడా చదవండి: ఎండిన కొబ్బరితో గుండెకు ప్రయోజనకరం.. బరువు తగ్గడానికి బెస్ట్ ఫుడ్
నారాయణ పేట జిల్లాలో కొడుకు పెళ్లి ఆగిపోవడం అవమానంగా భావించిన తండ్రి ఆత్మహత్య చేసుకోవడం సంచలనంగా మారింది. వివరాల ప్రకారం జిల్లా కేంద్రానికి చెందిన కాంజి గోవిందరావు కుమారుడు అభిషేక్ జ్ఞానికి , విజయ్‌కుమార్ కూతురు శ్వేతతో పెళ్లి కుదిరింది. నాలుగు నెలల క్రితం ఎంగేజ్‌మెంట్ కార్యక్రమాన్ని సైతం ఘనంగా నిర్వహించారు.ఈ నెల 9న పెళ్లి ముహూర్తం నిశ్చయించి పెళ్లిపత్రికలు కూడా పంచారు.
ఇది కూడా చదవండి: టీజీఎస్ ఆర్టీసీకి షాక్.. 10 రూపాయలకు పది వేల ఫైన్
కాగా.. ఆదివారం ఉదయం పెళ్లి కూతురు శ్వేత తన ప్రియుడు వెంకటేశ్‌తో వెళ్లిపోయింది. దీంతో పెళ్లి ఆగిపోయింది. అయితే మంగళవారం తన కుమారుడిని పెళ్లి కొడుకుని చేయాల్సి ఉండగా ఇలా పెళ్లి ఆగిపోవడం భరించలేక.. మనస్తాపంతో తండ్రి గోవిందరావు ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కూతురి ప్రేమ వ్యవహారం తెలిసినా విజయ్‌కుమార్ దాచిపెట్టి.. పెళ్లికి సిద్ధమై పరువు తీశారని, అందుకే గోవిందరావు ఆత్మహత్యకు పాల్పడ్డాడని కుటుంబసభ్యులు ఆరోపించారు. తన తమ్ముడి చావుకు కారణమైన వారిపై చర్య తీసుకోవాలని మృతుడి సోదరుడు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు.
ఇది కూడా చదవండి: ఒక్క రూపాయి ఖర్చు లేకుండా.. ఈ 5 చిట్కాలతో మీ ఇంట్లో నుంచి ఎలుకలు పరార్!