/rtv/media/media_files/2025/06/30/raja-singh-2025-06-30-11-39-10.jpg)
Raja Singh
Raja Singh Resignation: బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఆ పార్టీలో ప్రస్తుతం సంచలనంగా మారారు. ఆయన అసంతృప్తితో బీజేపీకి రాజీనామా చేశారు. గోషామహాల్ ఎమ్మెల్యేగా ఉన్న ఆయన ఆ పార్టీ రాష్ట్రంలో కీలక నాయకుడు. హైదరాబాద్‌లో బీజేపీకి రాజాసింగ్ మంచి మైలేజ్ అనే చెప్పవచ్చు. యూత్‌లో రాజాసింగ్‌కు ఉన్న క్రేజ్ అంతా ఇంత కాదు. కానీ.. గతకొన్ని రోజులుగా ఆయన సొంతపార్టీ నేతలపైనే ఆరోపణలు చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావద్దనే పెద్ద పెద్ద నాయకులు పని చేస్తున్నారని అన్నారు. గతంలో ఆ పార్టీ అధ్యక్షుడిగా పని చేసిన బండి సంజయ్, కిషణ్ రెడ్డిలను టార్గెట్‌గా చేస్తూ పలుమార్లు అనేక ఆరోపణలు చేశారు.
Also Read: రోటీని నెయ్యితో తినే విషయంపై ఆరోగ్య నిపుణులు ఏమంటున్నారంటే!
కష్టపడి పని చేస్తున్న కార్యకర్తలకు పార్టీలో అవకాశాలు దక్కడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈక్రమంలోనే ఆయన బీజేపీకి రాజీనామ చేశారు. కానీ అధిష్టానం దాన్ని అంగీకరించలేదు. మూడు రోజులు కావస్తున్న రాజీనామాపై క్లారిటీ ఇవ్వలేదు. మరో కొన్ని నెలల్లో GHMC, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు రానున్నాయి. ఈక్రమంలో ఆయన రాజీనామా ఆపార్టీకి పెద్ద దెబ్బే అని చెప్పుకోవాలి.
Also Read: వర్షాకాలంలో ఈ 5 ఫుడ్స్ అస్సలు తినొద్దు.. తింటే డేంజర్.. లిస్ట్ ఇదే!
గత GHMC ఎన్నికల్లో బీజేపీ మంచి ఫలితాను రాబట్టుకుంది. కానీ.. ఈసారి రాజాసింగ్ రాజీనామా ఆ పార్టీలో కలవరం రేపుతుంది. దీంతో రాజాసింగ్ రాజీనామాను GHMC, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల వరకూ అడ్డుకోవాలని బీజేపీ ఢిల్లీ పెద్దలు ఆలోచిస్తున్నట్లు సమాచారం. ఎందుకంటే రానున్న ఎన్నికల్లో ఆ పార్టీ అధిక సీట్లు గెలవాలంటే రాజాసింగ్ బ్రాండ్ అవసరం. దాదాపు ఆయన పార్టీ వీడకుండా చేసేందుకు బుజ్జగింపు చర్యలు చేయనున్నారు. అదీ కుదరదంటే ఆయన రాజీనామాపై బీజేపీ ప్లాన్ B అమలు చేసేవిధంగా ఆలోచిస్తోంది. GHMC, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల వరకూ రాజాసింగ్ పార్టీని వీడికుండా చూసుకుంటుంది. తర్వాత అధిష్టానం ఏం చేయాలో ఆలోచించనున్నట్లు కనబడుతుంది. ఈక్రమంలోనే కార్యకర్తలు, రాజాసింగ్ అనుచరులతో ఆయనకు సర్థి చెప్పే ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది.