Komatireddy: కోమటిరెడ్డికి మంత్రి పదవిపై ఆశ పెట్టింది వాళ్లే.. బయటపడ్డ సీక్రెట్.. కాంగ్రెస్ లో కొత్త లొల్లి!

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన కామెంట్స్ తో వార్తల్లో నిలుస్తున్నారు. ఇటీవల జరిగిన మంత్రివర్గ విస్తరణలో తనకు మంత్రి పదవి దక్కకపోవడంపై అసంతృప్తిగా ఉన్న ఆయన పార్టీపై, ప్రభుత్వం పైనే సంచలన వ్యాఖ్యలు చేస్తూ హాట్ టాపిక్ గా నిలుస్తున్నారు

New Update
komatireddy

Komatireddy: మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే  కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన కామెంట్స్ తో వార్తల్లో నిలుస్తున్నారు. ఇటీవల జరిగిన మంత్రివర్గ విస్తరణలో తనకు మంత్రి పదవి దక్కకపోవడంపై అసంతృప్తిగా ఉన్న ఆయన పార్టీపై, ప్రభుత్వం పైనే సంచలన వ్యాఖ్యలు చేస్తూ హాట్ టాపిక్ గా నిలుస్తున్నారు.  ఏకంగా సీఎం రేవంత్ రెడ్డిని ఆయన టార్గెట్ చేస్తూ కామెంట్స్ చేయడం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది.  

వాస్తవానికి మంత్రివర్గ విస్తరణలో రాజగోపాల్ రెడ్డికి చోటు కల్పించే విషయంలో పార్టీలో సుదీర్ఘంగానే చర్చ జరిగినట్లుగా తెలుస్తోంది. అయితే, క్యాబినెట్లో అగ్రకులానికి చెందిన వారికి కొత్తగా చోటు కల్పించేందుకు అధిష్ఠానం విముఖత వ్యక్తం చేసినట్టు సమాచారం. ప్రస్తుతం కేబినెట్ లో ఉమ్మడి నల్లగొండ జిల్లా నుంచి రెడ్డి సామాజిక వర్గం తరుపున  క్యాబినెట్లో ఉత్తమకుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఉన్నారు కాబట్టి  మూడో వ్యక్తిగా రాజగోపాల్ రెడ్డికి చోటు కల్పిస్తే అది బీసీ, ఎస్సీ, ఎస్టీ.. ఇతర సామాజిక వర్గాల్లో అసంతృప్తికి దారి తీస్తుందని అధిష్టానానికి రాష్ట్ర నాయకత్వానికి స్పష్టం చేసినట్లుగా తెలుస్తోంది.

Also Read:కాంగ్రెస్ నేతపై వాటర్‌ బాటిల్‌ విసిరిన BRS ఎమ్మెల్యే

కోమటిరెడ్డి సోదరుల్లో ఎవరో ఒకరికి మాత్రమే క్యాబినెట్లో చోటు ఇస్తాని స్పష్టం చేసినట్లు సమాచారం. అయితే కాంగ్రెస్ లో చేరితే తనకు మంత్రి పదవి ఇస్తామని భట్టి విక్రమార్క, మాణిక్ రావ్ ఠాక్రే, సునీల్ కనుగోలు, మహేశ్ కుమార్ గౌడ్ హామీ ఇచ్చారని  రాజగోపాల్ రెడ్డి అంటున్నారు. అయితే ఈ నలుగురు రాజగోపాల్ రెడ్డికి  ఇచ్చిన హామీ గురించి అధిష్టానం పెద్దలకు తెలుసా లేదా అనే దానిపై క్లారిటీ లేదు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా వివిధ పార్టీల నుంచి కాంగ్రెస్ లో చేరిన నేతలకు సునీల్ కనుగోలు, ఠాక్రే ఎడాపెడా హామీలు ఇచ్చారని పార్టీ వర్గాల నుంచి వినిపిస్తున్న మాట. ఇప్పుడు ఆ హామీలే పార్టీకి, ప్రభుత్వానికి గుదిబండలా మారాయని పార్టీలోని నేతల నుంచి వినిపిస్తోంది.

Also Read: సృష్టి ఫర్టిలిటీ స్కాంలో 80 మంది శిశువుల విక్రయం.. వెలుగులోకి నమ్రత బాగోతాలు

రాజగోపాల్ రెడ్డిపై క్రమశిక్షణ చర్యలు 

తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై క్రమశిక్షణ చర్యలు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (TPCC) క్రమశిక్షణ కమిటీ సీరియస్‌గా స్పందించింది. కమిటీ ఛైర్మన్ మల్లు రవి, రాజగోపాల్ రెడ్డితో నేరుగా మాట్లాడి ఈ సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నిస్తానని తెలిపారు. రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలపై రాష్ట్ర నాయకత్వం కాంగ్రెస్ అధిష్ఠానానికి నివేదిక పంపినట్లు తెలుస్తోంది. దీనిపై త్వరలో హైకమాండ్ ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది. ఈ చర్చల తర్వాతే రాజగోపాల్ రెడ్డిపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది స్పష్టమవుతుంది.

Advertisment
తాజా కథనాలు