ధరణికి గుడ్‌బై.. ఇక నుంచి భూమతే!

తెలంగాణ ప్రభుత్వం ధరణి పోర్టల్ ప్లేస్‌లో భూమాత తీసుకురావాలని నిర్ణయించింది. సచివాలయంలో సోమవారం కేబినెట్ భేటిలో కొత్త ఆర్ఓఆర్, భూమాత పోర్టల్ గురించి చర్చించారు. వీటికి మంత్రివర్గ ఆమోదం తెలిపింది. అసెంబ్లీలో చర్చించిన తర్వాత గవర్నర్ ఆమోదానికి పంపనున్నారు.

New Update
bhoomatha

తెలంగాణ ప్రభుత్వం భూరికార్డుల కోసం ధరణి స్థానంలో భూమాతను తీసుకురావాలని నిర్ణయించింది. అలాగే రెవెన్యూ విధానంలో మార్పులు చేస్తూ.. ఆర్ఓఆర్ చట్టం 2024 ముసాయిదా బిల్లును తయారు చేసింది. సోమవారం మంత్రివర్గం సచివాలయంలో భేటి అయి ఆర్ఓఆర్ చట్టం 2024కు ఆమోదం తెలిపింది. రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ కొత్త ఆర్ఓఆర్ చట్టం గురించి కేబినెట్ సమావేశంలో వివరించారు. ఆ చట్టంపై అసెంబ్లీలో చర్చ అనంతరం గవర్నర్ ఆమోదం కోసం పంపనున్నారు.

Also read: సోనియా గాంధీ తీసుకున్న నెహ్రూ లేఖలు అప్పగించండి: కేంద్రం

Also Read: మసీదులో జైశ్రీరాం అంటే తప్పేంటి..సుప్రీంకోర్టు ప్రశ్న

కొత్త ఆర్ఓఆర్ చట్టంలో భాగంగా ప్రస్తుతం ఉన్న ధరణి సైట్‌లో అనేక మార్పులు తీసుకురానున్నారు. ధరణికి బదులు భూమాత ఏర్పాటు చేయనున్నారు. ఈ విషయాన్ని అధికారికంగా ఇంకా ప్రభుత్వం ప్రకటించలేదు. ధరణి‌ పోర్టల్లో 33 మాడ్యూల్స్ ఉన్నాయి. ఒక్కో సమస్యకు ఒక్కో మాడ్యూల్ ఉపయోగిస్తారు. అయితే ధరఖాస్తు టైంలో ప్రాబ్లమ్ ఒకటై.. మాడ్యూల్ సెలెక్ట్ చేసే సమయంలో వేరే దాన్ని ఎంచుకుంటే ఆ ధరఖాస్తునే తిరస్కరిస్తున్నారు. ఆర్ఓఆర్ కొత్త చట్టంలో మాత్రం ఏ మాడ్యూల్లో ధరఖాస్తు చేసినా భూవివాధాలు పరిష్కరించడానికి వీలుగా ఉంటుంది. ధరణిలో ఉన్న ఎక్కువ మాడ్యూల్స్ భూమాతలో 14 మాడ్యూల్స్‌కు కుదించినట్లు తెలుస్తోంది.

Advertisment