BIG BREAKING: దీపావళిలోగా రూ.1200 కోట్ల బకాయిలు విడుదల.. భట్టి కీలక ప్రకటన

తెలంగాణలో వృత్తి విద్యా కాలేజీల యాజమాన్యాలతో రాష్ట్ర ప్రభుత్వం చేసిన చర్చలు సఫలమయ్యాయి. దీపావళిలోగా రూ.1200 కోట్ల బకాయిలు రిలీజ్ చేసేందుకు రేవంత్ సర్కార్‌ హామీ ఇచ్చింది.

New Update

తెలంగాణలో వృత్తి విద్యా కాలేజీల యాజమాన్యాలతో రాష్ట్ర ప్రభుత్వం చేసిన చర్చలు సఫలమయ్యాయి. దీపావళిలోగా రూ.1200 కోట్ల బకాయిలు రిలీజ్ చేసేందుకు రేవంత్ సర్కార్‌ హామీ ఇచ్చింది. విద్యార్థుల ఫీజు రియింబర్స్‌మెంట్‌కు సంబంధించి మంత్రులు భట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు, ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి కళాశాలల యాజమాన్యాల ప్రతినిధులతో చేసిన చర్చలు ముగిశాయి.  అనంతరం మంత్రి భట్టి విక్రమార్క మీడియాతో మాట్లాడారు. వారంలో రూ.600 కోట్లు, దీపావళి నాటికి మరో రూ.600 కోట్లు చెల్లిస్తామని పేర్కొన్నారు.

Also read:  రైతులకు యూరియా కొరత.. రెచ్చిపోతున్న దొంగలు

ఫీజు రియింబర్స్‌మెంట్‌ను కాంగ్రెస్‌ ప్రభుత్వమే తీసుకొచ్చిందని గుర్తుచేశారు. బీఆర్ఎస్‌ హయాంలో సకాలంలో ఫీజు రియింబర్స్‌మెంట్ విడుదల చేయాలేదని విమర్శించారు. మేము ప్రభుత్వానికి భారమైనా కూడా విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని బకాయిలు విడుదల చేస్తున్నామని పేర్కొన్నారు. అలాగే ఫీజు రియింబర్స్‌మెంట్‌పై కమిటీ వేయాలని నిర్ణయించుకున్నామని తెలిపారు.

Advertisment
తాజా కథనాలు