/rtv/media/media_files/2025/09/15/urea-shortage-in-telangana-2025-09-15-21-10-40.jpg)
Urea Shortage in telangana
తెలుగు రాష్ట్రాల్లో యూరియా కొరత మాములుగా లేదు. ఇది ఇప్పుడు తీవ్రమైన సమస్యగా మారింది, ముఖ్యంగా ఖరీఫ్ సీజన్‌లో. ఇది పంటల సాగుకు అవసరమైన కీలక సమయం కాబట్టి రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. యూరియా కోసం రైతులు గంటల తరబడి ఎరువుల దుకాణాలు, పీఏసీఎస్ కేంద్రాల ముందు క్యూలో నిలబడాల్సి వస్తోంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు వేచి చూసినా, అవసరమైనంత యూరియా దొరకడం లేదని వాపోతున్నారు.ఈ క్రమంలోనే దొంగలు కూడా రెచ్చిపోతున్నారు.
రైతులకు దొరికిన యూరియా బస్తాలను కూడా దొచుకుంటున్నారు. కామారెడ్డి జిల్లా బిక్కనూర్ మండలం రామేశ్వర్ పల్లికి చెందిన తక్కల్ల గంగారెడ్డి తన వరి పంటకు యూరియా చల్లేందుకు రెండు యూరియా బస్తాలను వ్యవసాయ క్షేత్రం వద్ద భద్ర పరిచారు. సోమవారం గుర్తు తెలియని ఇద్దరు యువకులు ద్విచక్ర వాహనంపై వచ్చి యూరియా బస్తాను ఎత్తుకెళ్లినట్లు రైతు ఆరోపించారు. యువకులు యూరియా బస్తాను తీసుకెళ్తున్న దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.