/rtv/media/media_files/2025/05/06/CxhAubUpslnPC70GLCUi.jpg)
Balagam actor babu
Balagam movie :వెండి, బుల్లితెర మీద తమ ప్రతిభను ప్రదర్శించి అందరినీ అలరించిన ఎందరో సీనియర్ నటులు నేడు తినడానికి తిండిలేక, ఉండడానికి ఇల్లులేక, అనారోగ్యాల పాలవుతున్నారు. సినిమాల్లో తమ నటనతో మెప్పించినప్పటికీ చాలా మందికి అవకాశాలురాకా, వచ్చినా సరైన గుర్తింపు, రెమ్యూనరేషన్ లేక చితికిపోతున్నారు. సినిమాల్లో వచ్చిన డబ్బుతో జీవితాన్ని నెట్టుకురాలేక ఇబ్బందులు పడుతున్నారు. అలాంటి వారిలో కళాకారుడు గుడిబోయిన బాబు ఒకరు. బలగం చిత్రంలో తన నటనతో మెప్పించిన ఆయన ఇప్పుడు అనారోగ్యంతో మంచంపట్టారు. వైద్యం, మందుల కొనుగోలుకు డబ్బులు లేక ఆర్థిక ఇబ్బందులు పడుతున్నట్లు బాధిత కుటుంబ సభ్యులు, వరంగల్ రంగస్థల కళాకారుల సంఘం ప్రతినిధులు తెలిపారు.
పలు చిత్రాల్లో నటించడంతో పాటు, జబర్ధస్థ్ వంటి షో ద్వారా గుర్తింపు తెచ్చుకున్న వేణు యెల్డండి దర్శకత్వం లో వచ్చిన చిత్రం బలగం. ఈ చిత్రం అన్ని వర్గాల అభిమానాన్ని సొంతం చేసుకుంది. ఈ చిత్రంలో కొమురయ్య తమ్ముడు అంజన్న పాత్రలో నటించిన జీవీ బాబు కొంత కాలంగా మూత్రపిండాల సమస్య తో బాధపడుతున్నారు. ప్రస్తుతం ఆయన వరంగల్‌లోని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే వైద్యం చేయించుకోడానికి, మందుల కొనుగోలుకు డబ్బులు లేకపోవడంతో ఆర్ధికంగా ఇబ్బందులు పడుతున్నారు. జీవీ బాబు కుటుంబ సభ్యులు కొన్నిరోజులుగా వరంగల్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో అతనికి డయాలసిస్ చేయిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం స్పందించి జీవీ బాబుకు మెరుగైన వైద్యం అందించాలని, దాతలు, కళాకారులు ఆర్థికసాయం అందించేందుకు ముందుకు రావాలని తెలంగాణ నాటక సమాజాల సమాఖ్య అధ్యక్షుడు ఆకుల సదానందం కోరారు.
ఇది కూడా చూడండి: Naa Anveshana: యూట్యూబర్ అన్వేష్ అడ్డంగా దొరికేశాడు.. బెట్టింగ్ యాప్ ప్రమోషన్ వీడియో వైరల్!
వరంగల్ జిల్లా రామన్నపేటకు చెందిన బాబు రంగస్థల కళాకారుడి నుంచి సినీ నటుడిగా ఎదిగారు. బలగం చిత్రంలో అంజన్నగా నటించి ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు పొందారు. ప్రభుత్వం, దాతలు సానుకూలంగా స్పందించి గుడిబోయిన బాబుకు వైద్యం కోసం ఆర్థిక సహాయం చేయాలని కుటుంబ సభ్యులు మరోసారి విజ్ఞప్తి చేశారు. కాగా ప్రముఖ జానపద కళాకారుడు, ‘బలగం’ చిత్రంలో గాయకుడు పస్తం మొగిలయ్య (67) గత ఏడాది డిసెంబర్‌లో మూత్ర పిండాల వ్యాధితోనే కన్నుమూసిన విషయం తెలిసిందే.
Also Read: Israel: హౌతీలపై విరుచుకుపడ్డ ఇజ్రాయెల్..50 బాంబులతో ప్రతీకార దాడులు