ఈ మధ్య కాలంలో రోడ్డు ప్రమాదాలు విపరీతంగా జరుగుతున్నాయి. ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు. అందులోనూ యువతే అధికంగా ఉంటున్నారని ఇటీవల పోలీసు అధికారులు తెలిపారు. ర్యాష్ డ్రైవింగ్, డ్రంక్ న్ డ్రైవ్, హెల్ మెట్ ధరించకపోవడం వల్ల ఎక్కువగా ప్రాణాలు విడుస్తున్నారని తెలిపారు. అయితే ఇప్పుడు వాహన దారుల ప్రాణాలకు భరోసా ఇచ్చే విధంగా తెలంగాణ రాష్ట్ర సర్కార్ ముందడుగు వేసింది. ఇందులో భాగంగానే గ్రేటర్ లో ప్రజా, సరకు రవాణా వాహనాల తనిఖీలకు ఆటోమేటెడ్ వాహన ఫిట్ నెస్ కేంద్రాలు అందుబాటులోకి తీసుకురానుంది.
ఇది కూడా చదవండి: రాష్ట్రంలో బాణాసంచా నిషేధం.. గోదాంలు సీల్ చేయాంటూ హైకోర్టు ఆదేశాలు!
ఎందుకీ ఫిట్ నెస్ కేంద్రాలు
ఎందుకంటే ప్రస్తుతం వాహనాల తనిఖీల ఫిట్ నెస్ విషయంలో కొందరు అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. కొన్నిసార్లు వాహనాలకు ఫిట్ నెస్ లేకుండా చూసీ చూడనట్లు వదిలేస్తున్నారని అంటున్నారు. అంతేకాకుండా ఏదో తూతూమంత్రంగా తనిఖీలు చేసి సర్టిఫికేట్ జారీ చేస్తుండటంతో ఎప్పటికప్పుడు ప్రమాదాలు జరిగి ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు.
ఇది కూడా చదవండి: ప్రియురాలికోసం.. కరణ్ జోహర్‌కు భారీ ఆఫర్ ఇచ్చిన సుఖేశ్!
ఇది మాత్రమే కాకుండా స్కూల్ పిల్లల బస్సులకు సైతం సక్రమంగా ఫిట్ నెస్ ధ్రువీకరణ జరగడం లేదని.. పాడైపోయిన బస్సులు, వ్యాన్లనే ఉపయోగిస్తున్నారని.. దీనివల్ల విద్యార్థుల ప్రాణాలు సైతం గాల్లో కలిసిపోతున్నాయని కొందరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇప్పుడు వాహనాల ఫిట్ నెస్ లో జరుగుతున్న అక్రమాలకు అడ్డుకట్ట పడనుంది. రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర నేపథ్యంలో ఈ కేంద్రాల ఏర్పాటుకు మార్గం సుగమం కానుంది.
ఎన్ని కేంద్రాలు ఏర్పాటు..
ఇది కూడ చదవండి: హనీ ట్రాప్ వెనుక వైసీపీ నేతలు..? వెలుగులోకి సంచలన విషయాలు
గ్రేటర్ పరిధిలోని నలువైపులా మొత్తం నాలు కేంద్రాలను ఏర్పాటు చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. సికింద్రాబాద్, నాగోల్, ఉప్పల్, కొండాపూర్ వంటి ప్రాంతాల్లో ఈ ఆటోమేటెడ్ ఫిట్ నెస్ కేంద్రాలు ఏర్పాటు చేయడం ద్వారా అందరికీ అందుబాటులో ఉంటాయని భావిస్తున్నారు. అయితే ఇందులో ఒక్కో కేంద్రానికి రూ.80 కోట్ల వరకు ఖర్చు చేయనున్నారు. వాహనాలకు సంబంధించి టైర్ల నుంచి బ్రేకుల వరకు ఆటోమేటెడ్ కేంద్రాల్లో పరిశీలించడానికి రెడీ అయ్యారు.
తనిఖీలు ఎలా చేస్తారంటే..
ఇది కూడా చూడండి: ఘోర ప్రమాదం.. టెంపోను బస్సు ఢీకొనడంతో 8 మంది చిన్నారులు మృతి
ఇంతక ముందు వాహనాల ఫిట్ నెస్ తనిఖీలను మోటార్ వెహికల్ ఇన్ స్పెక్టర్లు చేసేవారు. అయితే ఇప్పుడు కంప్యూటర్లే వాహనాలను చెక్ చేస్తాయి. వాహనాలలో ప్రతి భాగాన్ని దాదాపు 40 అంశాలను అన్ని కోణాల్లో పరిశీలిస్తాయి. అలాగే వాహనాల నుంచి వచ్చే పొగలో కాలుష్య కారకాలను గుర్తిస్తుంది. దీంతో పొల్యూషన్ అండ్ కంట్రోల్ సర్టిఫికేట్ అర్హత ఉందా లేదా అని ఆటోమేషన్ లోనే గుర్తిస్తుంది. దీనిని గంటలో ఒక్కో కేంద్రంలో 25 నుంచి 30 వాహనాల వరకు తనిఖీలు చేసేవిధంగా రూపొందిస్తున్నారు. దీనిబట్టి చూస్తే పాతవాహనదారులకు గట్టి షాకే అని చెప్పాలి.