MLA Anirudh : అరబిందో ఫార్మా కంపెనీని తగలబెడతా..జడ్చర్ల ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు

కాలుష్యం నీటిని బయటకు వదిలితే పోలేపల్లి సెజ్‌లోని అరబిందో ఫార్మా కంపెనీని తగలబెడతానంటూ మహబూబ్‌నగర్‌ జిల్లా జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆదివారం ఉదయం 11 గంటలకు అరబిందో ఫార్మా కంపెనీని తగలబెడతానని ఆయన హెచ్చరించారు.

New Update
Anirudh Reddy Janampalli

Anirudh Reddy Janampalli

MLA Anirudh :  కాలుష్యం నీటిని బయటకు వదిలితే పోలేపల్లి సెజ్‌లోని అరబిందో ఫార్మా కంపెనీని తగలబెడతానంటూ మహబూబ్‌నగర్‌ జిల్లా జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. గత అసెంబ్లీ సమావేశాల్లో పోలేపల్లి సెజ్‌లోని శిల్ప, అరబిందో కంపెనీలు కాలుష్యాన్ని వెదజల్లుతున్న విషయాన్ని సభ దృష్టికి తీసుకెళ్లానని, అయినా ఇప్పటివరకు ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. దీంతో సొంత ప్రభుత్వానికి, పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకు జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే మరోసారి హెచ్చరించారు.జడ్చర్ల ప్రాంతంలో ఉన్న అరబిందో ఫార్మా కంపెనీ కలుషిత నీరు వదులుతుందని, రైతుల పొలాలు దెబ్బతింటున్నాయని అనేక సార్లు ప్రభుత్వానికి, పొల్యూషన్ బోర్డుకు ఫిర్యాదు చేశానన్నారు. ఎందుకు ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు? కంపెనీ యాజమాన్యంతో పొల్యూషన్ బోర్డు అధికారులు కుమ్మక్కయ్యారా? రేపు ఒక్కరోజు సమయం ఇస్తున్నాను, కంపెనీ మూసివేకపోతే ఆదివారం ఉదయం 11 గంటలకు అరబిందో ఫార్మా కంపెనీని తగలబెడతానని ఆయన హెచ్చరించారు.

ఇది కూడా చదవండి: ఏపీలో దారుణం.. లారీతో తొక్కించి ఇద్దరి హత్య.. రూ.200 కోసం!


 కాగా  పోలేపల్లి సెజ్ ప్రాంతంలోని అరబిందో కంపెనీ వ్యవహారంపై అనిరుద్‌ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి.  అధికార కాంగ్రెస్‌ పార్టీకి చెందిన అనిరుధ్‌రెడ్డి కొన్నిరోజులుగా స్వపక్షంలో విపక్షం మాదిరిగా ఘాటు వ్యాఖ్యలు చేస్తూ వస్తున్నారు. శుక్రవారం ఆయన ఒక వీడియో క్లిప్పింగ్‌ విడుదల చేశారు. గతంలోనే ఆ కంపెనీపై చర్యలు తీసుకోవాలంటూ స్పీకర్‌కు లేఖ రాసినట్టు వెల్లడించారు. అరబిందో ఫార్మా కంపెనీ కాలుష్య జలాలను ముదిరెడ్డిపల్లి చెరువులోకి పంపిస్తుండటంతో చేపలు చనిపోతున్నాయని, మత్స్యకారుల పెట్టుబడులన్నీ నాశనమవుతున్నాయని ఎమ్మెల్యే ఆవేదన వ్యక్తంచేశారు.

ఇది కూడా చదవండి: అయ్యో బిడ్డలు.. ఆడుకోవడానికి వెళ్లి అనంతలోకాలకు.. విషాదాంతమైన నెల్లూరు చిన్నారుల మిస్సింగ్!

ఈ చెరువు మంచినీటి వనరుగా ఉందని ఆయన పేర్కొన్నారు. చుట్టుపక్కల ప్రాంతాల్లో కాలుష్యంతో అనేక దుష్ఫలితాలు వస్తున్నాయని ఆయన ఆరోపించారు. డబ్బులు ఇచ్చి అధికారులను, రాజకీయ నాయకులను కొనవచ్చనే భ్రమలో అరబిందో కంపెనీ ఉన్నదని ఆరోపించారు. తాను రైతుల పక్షాన ఉంటానని, ఈ కంపెనీపై చర్య తీసుకోకపోతే తానే యాక్షన్‌లోకి దిగుతానని హెచ్చరించారు.ఆదివారం ఉదయం 11 గంటలవరకు సమయం ఇస్తున్నానని లేదంటే తానే తగలబెడుతానని సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఇది కూడా చదవండి: అయ్యో బిడ్డలు.. ఆడుకోవడానికి వెళ్లి అనంతలోకాలకు.. విషాదాంతమైన నెల్లూరు చిన్నారుల మిస్సింగ్!

Advertisment
తాజా కథనాలు