Snake In Curry Puff : ఇదెందయ్యా..ఇది కర్రీ పఫ్ లో పాము పిల్ల.. షాక్ తో ఆ మహిళ ఏం చేసిందంటే..
ఒక మహిళ తింటున్న కర్రీ పఫ్లో ఏకంగా పాము బయటపడిన ఘటన కలకలం రేపింది. ఈ సంఘటన తెలంగాణలో మంగళవారం చోటుచేసుకుంది. జడ్చర్ల లోని శ్రీలక్ష్మి అయ్యంగారి బేకరీలో రెండు ఎగ్ పఫ్ లు, రెండు కర్రీ పఫ్ లు కొనుగోలు చేసిన మహిళలకు కర్రీ పఫ్ లో పాము పిల్ల కనిపించింది.