/rtv/media/media_files/2025/04/28/KDDmRWouxVuY7FjVbdVB.jpg)
MURDER in peddaplli
Peddapalli Murder: పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్లో(Agricultural Market) దారుణ హత్య జరిగింది.పట్టపగలే.. అదీ అంతా చూస్తుండగానే పెద్దపల్లిలో దారుణం చోటు చేసుకుంది. ఓ వ్యక్తి మరో వ్యక్తిని కిరాతకంగా పొడిచి చంపడంతో స్థానికులు భయంతో పరుగులు తీశారు. సోమవారం వ్యవసాయ మార్కెట్‌లో చోటు చేసుకున్న ఘటన స్థానికంగా సంచలనంగా మారింది.
Also Read: Hyderabad Metro:తగ్గుతున్న మెట్రో ప్రయాణికుల సంఖ్య.. ఆందోళనలో ఎల్‌అండ్‌టీ
కత్తితో మెడపై పొడిచి..
పెద్దపల్లి మండలం అప్పన్నపేట గ్రామానికి చెందిన పొలం కుమార్ ను, ధర్మారం మండలం దొంగతుర్తి గ్రామానికి చెందిన వేల్పుల సంతోష్ కత్తితో మెడపై పొడిచి దారుణంగా హత్య చేశాడు.ఆ సమయంలో అక్కడే ఉన్న ఓ మహిళ సొమ్మసిల్లి పడిపోయింది. అయితే.ఆ మహిళ సంతోష్ భార్యగా నిర్ధారణ అయ్యింది. వివాహేతర సంబంధమే ఈ హత్యకు కారణమై ఉండొచ్చని.. అందుకే భార్య కళ్ల ముందే ప్రియుడ్ని హతమార్చి ఉంటాడని భావిస్తున్నారు.
ఇది కూడా చదవండి: రాత్రిపూట కాళ్లలో ఈ లక్షణాలు కనిపిస్తే గుండెపోటుకు సంకేతం
సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు. నిందితుడితో పాటు ఓ మహిళను పోలీసులు అదుపులోకి తీసుకొని స్టేషన్ కు తరలించారు. హత్యకు గల పూర్తి కారణాలు తెలియాల్సి ఉంది.హత్య అనంతరం సంతోష్ అక్కడే ఉండటం గమనార్హం. హత్యను చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు వచ్చి నిందితుడు సంతోష్‌ను పోలీసులు అక్కడికక్కడే అరెస్ట్ చేశారు. అయితే కేసు విచారణ చేపట్టిన పోలీసులు.. హత్యకు గల పూర్తి వివరాలు తెలియజేయాల్సి ఉంది.
ఇది కూడా చదవండి: KCR: అధికారం పోగానే నక్సలైట్లు గుర్తుకొచ్చారా.. కేసీఆర్‌పై రఘునందన్ సంచలన కామెంట్స్!
ఇది కూడా చదవండి: వాడో జోకర్.. మోదీజీ పాకిస్తాన్‌ను FATF బ్లాక్‌లిస్ట్‌లో చేర్చండి: అసదుద్దీన్ ఒవైసీ