/rtv/media/media_files/2025/08/23/kukatpally-traffic-jam-2025-08-23-16-19-22.jpg)
Kukatpally Traffic jam
Hyderabad: కూకట్‌పల్లిలోని జాతీయ రహదారిపై పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ అయింది. సుమారు మూడు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. నాలుగు వాహనాలు ఒకదానికొకటి ఢీ కొనడంతో ప్రమాదం జరిగింది. దీంతో వాహనదారులు గంటల తరబడి రోడ్డుపై నిలిచిపోయారు. సుమిత్రానగర్ హెచ్‌పీ పెట్రోల్ బంక్ వద్ద శనివారం ఒక కారు అకస్మాత్తుగా బ్రేక్ వేయడంతో వెనుక వస్తున్న రెండు టెంపోలు, రెండు కార్లు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో టెంపో డ్రైవర్‌కు స్వల్ప గాయాలయ్యాయి, దీనివల్ల కూకట్‌పల్లి జాతీయ రహదారిపై సుమారు మూడు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. కూకట్‌పల్లి జాతీయ రహదారిపై ఈ ప్రమాదం జరగడంతో వందలాది వాహనాలు ఎక్కడివక్కడ నిలిచిపోయాయి. సుమిత్రానగర్ హెచ్‌పీ పెట్రోల్ బంక్ సమీపంలో ఓ కారు డ్రైవర్ ఒక్కసారిగా బ్రేక్ వేయడంతో దానికి వెనుక వస్తున్న వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో టెంపో వాహనంలో ఉన్న డ్రైవర్ స్వల్పంగా గాయపడ్డారు.
ఇది కూడా చూడండి:Kukatpally Murder Case: క్రికెట్ కిట్ కోసమే దొంగతనం చేసిన విద్యార్థి.. కూకట్‌పల్లి మర్డర్ కేసులో వెలుగులోకి షాకింగ్ విషయాలు
ఢీకొన్న వాహనాలు రోడ్డుపైనే నిలిచిపోవడంతో కిలోమీటర్ల మేర వాహనాలు రోడ్లపై నిలిచిపోయాయి. దీంతో జాతీయ రహదారి మార్గం పూర్తిగా స్తంభించిపోయింది. గంటల తరబడి వాహనదారులు ట్రాఫిక్ లోనే చిక్కుకుపోయారు. నిమిషానికి మీటర్ దూరం కూడా కదిలే పరిస్థితి లేకపోవడంతో చాలా ఇబ్బందులకు గురవుతున్నారు.ఒకవైపు ట్రాఫిక్ జాం, మరోవైపు హారన్ల మోతలతో రోడ్లు మారుమోగుతున్నాయి. ట్రాఫిక్ పోలీసులు ఎంత ప్రయత్నించినా ట్రాఫిక్ క్లియర్ చేయడం కష్టంగా మారింది. ఈ రూట్లో ట్రాఫిక్ క్లియర్ అయ్యేందుకు చాలా సమయం పడుతుందని పోలీసులు చెబుతున్నారు. ముందుగా ప్రమాదానికి కారణమైన వాహనాలను రోడ్డుపై నుంచి తరలిస్తే ట్రాఫిక్‌ను క్లియర చేయడానికి అవకాశం ఉంటుంది అని చెబుతున్నారు పోలీసులు. వాటిని రోడ్డుమీదనుంచి తరలించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.
ఇది కూడా చూడండి:Dharmasthala Case: ధర్మస్థల కేసులో ఊహించని ట్విస్టులు.. సాక్షులు ఎందుకు మాట మార్చారు ? కారణం అదేనా