తెలంగాణలో మున్సిపాలిటీలకు స్పెషల్ ఆఫీసర్ల నియామకం

మున్సిపాలటీలు, కార్పొరేషన్‌లకు స్పెషల్ ఆఫీసర్లను నియమిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 2020లో వీటికి ఎన్నికలు నిర్వహించారు. ఐదేళ్ల పదవికాలం ముగియడంతో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్ వారి ప్లేస్‌లో స్పెషల్ ఆఫీసర్లును అపాయింట్ చేశారు.

New Update
muncipalities

muncipalities Photograph: (muncipalities)

తెలంగాణ రాష్ట్రంలో 120 మున్సిపాలిటీలు, 8 కార్పొరేషన్ల పదవికాలం ముగిసింది. అలాగే కరీంనగర్ కార్పొరేషన్‌కు ఎన్నికైన సభ్యుల పదవి కాలం జనవరి 28తో ముగియనుంది. ఆయా మున్సిపాలటీలు, కార్పొరేషన్‌లకు స్పెషల్ ఆఫీసర్లను నియమిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 2020లో వీటికి ఎన్నికలు నిర్వహించారు. ఐదేళ్ల పదవికాలం ముగియడంతో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్ వారి ప్లేస్‌లో స్పెషల్ ఆఫీసర్లును అపాయింట్ చేశారు.

ఇది కూడా చదవండి : కోర్టులో పందెంకోడి వేలంపాట.. తర్వాత కోడికి సన్మానం

రాష్ట్ర వ్యాప్తంగా 142 మున్సిపాలిటీలుండగా, ఇటీవల అసెంబ్లీలో 12 కొత్త మున్సిపాలిటీలను ప్రభుత్వం ప్రకటించింది. వీటితో కలిపితే 154. అయితే 2020లో 130 మున్సిపాలిటీలకు ఎన్నికలు జరిగాయి. వీటికి సంబంధించిన పాలక వర్గాల గడువు ఈ నెల 26తో ముగిసింది. వీటికి, కొత్తగా ఏర్పాటైన 12 మున్సిపాలిటీలకు కలిపి ఏప్రిల్‌ నాటికి ఎన్నికలు నిర్వహించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఉంది. 

ఇది కూాడా చదవండి :పద్మ పురస్కారాల్లో తెలంగాణపై కేంద్రం వివక్ష.. రేవంత్ ఫైర్

142 మున్సిపాలిటీలలో 130 మున్సిపాలిటీలకు 2020లో ఎన్నికలు జరగ్గా, 2021లో జీహెచ్‌ఎంసీతోపాటు గ్రేటర్‌ వరంగల్‌, ఖమ్మం, అచ్చంపేట, కొత్తూరు, నకిరేకల్‌, సిద్ధిపేట, జడ్చర్ల మున్సిపల్‌ ఎన్నికలు జరిగాయి. మరో నాలుగు మున్సిపాలిటీలకు ఎన్నికలు నిర్వహించలేదు. అందులో ఏజెన్సీ పరిధిలో ఉన్న పాల్వంచ, మణుగూరు, మందమర్రితోపాటు జహీరాబాద్‌ ఉన్నాయి. 


Advertisment
Advertisment
తాజా కథనాలు