/rtv/media/media_files/2025/11/15/fotojet-98-2025-11-15-16-00-06.jpg)
Another shock for the Maoists.. Surrender of two more key leaders?
Maoist Surrender: : ఎన్‌కౌంటర్లు, లొంగుబాట్లతో సతమతమవుతున్న మావోయిస్టు పార్టీకి మరో ఎదురుదెబ్బ తగలనుంది.మరో ఇద్దరు మావోయిస్టు కీలక నేతలు తెలంగాణ పోలీసుల ఎదుట లొంగిపోనున్నట్లు తెలుస్తోంది. మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యుడు, భద్రాద్రి కొత్తగూడెం- అల్లూరి సీతారామరాజు జిల్లాల డివిజన్ కమిటీ కార్యదర్శి కొయ్యడ సాంబయ్య అలియాస్ ఆజాద్‌తోపాటు డివిజన్ కమిటీ సభ్యుడు అప్పాసి నారాయణ అలియాస్ రమేశ్ లొంగిపోనున్నట్టు సమాచారం. వీరి లొంగుబాటుతో దాదాపు 90 శాతం అగ్రనాయకత్వం జనజీవన స్రవంతిలో కలిసినట్లేనని భావిస్తున్నారు.
అయితే వీరిద్దరూ కూడా వరంగల్ పోలీసుల ఎదుట లొంగిపోయినట్టుగా విశ్వసనీయ సమాచారం. కొయ్యడ సాంబయ్య అలియాస్ ఆజాద్ (బికేఎస్ఆర్ డివిజన్ కార్యదర్శి). అబ్బాస్ అలియాస్ రమేష్ (టెక్నికల్ టీం ఇన్చార్జి రామగుండం) గత రెండు రోజుల క్రితమే లొంగిపోయినట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయమై వరంగల్ పోలీసులు ఎలాంటి ప్రకటన చేయలేదు.
కాగా తెలంగాణ మావోయిస్టు రాష్ట్ర కమిటీలో చురుకుగా ఉన్న ఈ ఇద్దరు ఆగ్రనేతలు లతోపాటు మరో 8 మంది వరంగల్ పోలీసులకు లొంగిపోయారని తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన సోమవారం వెళ్లడయ్యే అవకాశం ఉంది. లొంగిపోయిన వారిలో ఆజాద్ గత కొన్ని దశాబ్దాలుగా మావోయిస్టు పార్టీలు కీలక వ్యూహాత్మక వ్యక్తిగా పనిచేస్తున్నట్లుగా తెలుస్తోంది. టెక్నికల్ టీం ఇన్చార్జ్ గా పనిచేసిన అబ్బాస్ నారాయణ అలియాస్ రమేష్ కూడా లొంగిపోయినట్లుగా తెలుస్తోంది. రమేష్ చాలాకాలంగా రామగుండం ప్రాంతంలో చురుకుగా పనిచేస్తున్నారని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. మావోయిస్టు పార్టీలో అంతర్గత విభేదాల నేపథ్యంలోనే పలువురు నాయకులు లొంగిపోతున్నట్టుగా తెలుస్తోంది. ఆజాద్ తెలంగాణ రాష్ట్ర కమిటీకి చెందిన ప్రముఖ మావోయిస్టు. ఆయనది ములుగు జిల్లాలోని ముద్దుల గూడెం గ్రామం.
Follow Us