Lady Aghori: తెలంగాణకు రీఎంట్రీ.. ఆత్మాహుతికి అఘోరీ రెడీ!

తెలంగాణకు అఘోరీ తిరిగి వచ్చింది. శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ కాలనీలో ఇటీవల ధ్వంసమైన నవగ్రహ విగ్రహాలను సందర్శించింది. హిందూ దేవాలయాల, ఆడపిల్లలపై అఘాయిత్యాలకు నిరసనగా తాను ఆత్మాహుతి చేసుకుంటా అని మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసింది అఘోరీ.

Aghori
New Update

Aghori: తెలంగాణకు అఘోరీ తిరిగి వచ్చింది. శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ కాలనీకి ఆమె చేరుకుంది. ఇటీవల ధ్వంసమైన నవగ్రహ విగ్రహాలను సందర్శించింది. అఘోరీని చూడడానికి జనాలు పెద్ద ఎత్తున చేరుకున్నారు. జనాలను కంట్రోల్ చేసేందుకు భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు పోలీసులు. హిందూ ధర్మం రక్షణ కోసం పోరాడుతుంటే.. తనను అడ్డుకోవడం ఎంతవరకు సమంజసం అని అఘోరీ మండిపడ్డారు. హిందూ దేవాలయాల, ఆడపిల్లలపై అఘాయిత్యాలకు నిరసనగా తాను ఆత్మాహుతి చేసుకుంటా అని మరోసారి సంచలన వ్యాఖ్యలు అఘోరీ.

Also Read:  Ap Assembly:నేడు అసెంబ్లీలో 3 బిల్లులు ప్రవేశ పెట్టనున్న ఏపీ ప్రభుత్వం

శివ తాండవం చేస్తానంటూ...

ఇటీవల ఆర్టీవీతో అఘోరీ మాట్లాడింది. సనాతన ధర్మం జోలికి వస్తే తాను సహించను అని తెలిపింది. ఎక్కడ ఆడపిల్లకి అన్యాయం జరిగితే అక్కడ తానుంటా అని పేర్కొంది. అంతేకాకుండా తెలంగాణలో తనను అపే మగాడు ఇంకా పుట్టలేదని మాట్లాడింది. తెలంగాణలో శివ తాండవం జరగబోతుందని.. ఆడపిల్ల మీద చేయి వేసినవాడి మర్మాంగాలు కోసేస్తా అని అఘోరీ చెప్పుకొచ్చింది. 

Also Read:  Train Accident: పెద్దపల్లి సమీపంలో పట్టాలు తప్పిన గూడ్స్...!

తెలంగాణలో ఆలయాలను ధ్వంసం అవుతుంటే ప్రభుత్వం ఏం చేస్తుంది అని మండిపడింది. మరోవైపు  పవన్ కళ్యాణ్ కూడా సనాతన ధర్మం కోసం పోరాడుతున్నారని.. అయితే ఆయన నుంచి తనకు ఎటువంటి సందేశం ఇంకా అందలేదని అఘోరీ చెప్పుకొచ్చింది. దీంతో ఆమె వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇదిలా మరోవైపు ఆమె ఓ వీడియో రిలీజ్ చేసింది. బెల్లంపల్లిలో నిర్వహించే లక్ష దీపాల మహోత్సవానికి తరలి రండి అని ఆ వీడియోలో పేర్కొంది. సనాతన ధర్మాన్ని కాపాడే బాధ్యత మనందరిపై ఉందని తెలిపింది. స్త్రీలపై దాడులను ఆపే శక్తి మన దగ్గర ఉందని చెప్పుకొచ్చింది. గోహత్యలను నివారించేందుకు పోరాడుదాం అని పేర్కొంది.

Also Read:  Pawan Kalyan: పవన్‌ కు మరో కీలక బాధ్యత అప్పగించిన మోదీ!

Also Read:  Harish Rao: రేవంత్ కి త్వరలోనే 70MMలో సినిమా చూపిస్తాం..!

#telangana #shamshabad #lady aghori #lady aghori comments
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe