Lady Aghori: అఘోరీ కాళ్లు మొక్కిన డిప్యూటీ సీఎం సతీమణి.. వీడియో వైరల్
లేడీ అఘోరీ తెలంగాణలో మళ్లీ ప్రత్యక్షమైంది. ఖమ్మం జిల్లా మధిరలో దర్శనమిచ్చింది. ఓ ప్రైవేట్ హాస్పిటల్ ప్రారంభోత్సవంలో పాల్గొంది. అదే సమయంలో తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సతీమణి నందిని అఘోరీ కాళ్లు మొక్కి ఆశీర్వాదం తీసుకున్నారు.