చెన్నూర్‌లో వివేక్ గెలుపు
చెన్నూరు నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి వివేక్ వెంకటస్వామీ గెలిచారు.
చెన్నూరు నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి వివేక్ వెంకటస్వామీ గెలిచారు.
ఓటు వేయడానికి వచ్చిన ఇద్దరు వృద్ధులు అస్వస్థతకు గురై చనిపోయిన సంఘటన ఆదిలాబాద్ పట్టణంలో చోటుచేసుకుంది. మావలకు చెందిన తోకల గంగమ్మకు (78) బూత్‌లోనే ఫిట్స్ రాగా. భుక్తాపూర్‌కు చెందిన రాజన్న (65) కళ్లు తిరిగి పడిపోయాడు. వారిద్దరూ చనిపోయినట్లు వైద్యులు తెలిపారు.
రాష్ట్రంలో రానుంది బీఎస్పీ సర్కారేనని...పెద్దపల్లి గెలిచేది తానే అంటూ ఆ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ఉష సంచలన వ్యాఖ్యలు చేశారు. దాసరి ఉష అంటే ఒక్క వ్యక్తి కాదు...రెండు లక్షల మంది ఓటర్లు అన్నారు. పెద్దపల్లిలో తాను భారీ మెజార్టీతో గెలుపొందడం గ్యారెంటీ అన్నారు.
బాసర ట్రిపుల్ ఐటీలో విషాదం నెలకొంది. ఇంజనీరింగ్ మొదటిసంవత్సరం చదువుతున్న విద్యార్థి ప్రవీణ్ కుమార్ ఆత్మహత్య చేసుకున్నాడు. కాలేజీకి అనుబంధంగాఉన్న హాస్టల్ నాలుగో అంతస్తులో ప్రవీణ్ కుమార్ సుసైడ్ కు పాల్పడ్డాడు.
50 ఏళ్ల పాలనలో కాంగ్రెస్ పార్టీ చేసిందేమి లేదని సీఎం కేసీఆర్ విమర్శించారు. ఖానాపూర్ నియోజకర్గంలో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన పాల్గొన్నారు. ఉన్న తెలంగాణను ఊడగొట్టిందే కాంగ్రెస్ పార్టీ అంటూ మండిపడ్డారు. 24 గంటలు కరెంట్ కావాలంటే బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయాలని ప్రజలను కోరారు.
చెన్నూరూ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి వివేక్కి ఈడీ షాక్ ఇచ్చింది. ఆయనపై ఫెమా నిబంధనల ఉల్లంఘన కింద కేసు నమోదు చేసింది. ఆయన నడుపుతున్న బోగస్ కంపెనీల వివరాలు, లావాదేవీలు జరిగే తీరుతెన్నులు వెల్లడించింది. తాజాగా రూ. 200 కోట్లకు పైగా లావాదేవీలు జరిగినట్లు గుర్తించింది.
బెల్లంపల్లి కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి జి. వినోద్ ఇంటిపై ఈడీ అధికారులు ఆకస్మిక దాడులు చేశారు. వినోద్‌తో పాటు ఆయన అనుచరులు, బంధువులు, మాజీ క్రికెటర్లైన శివలాల్ యాదవ్, ఆయూబ్ ఇళ్లు, ఆఫీసుల్లో సోదాలు నిర్వహించారు ఈడీ అధికారులు.
ఎన్నికల నేపథ్యంలో రాజకీయ నాయకులపై ఫోకస్ పెంచింది ఐటీ. తాజాగా చెన్నూరు కాంగ్రెస్ అభ్యర్థి జి. వివేక్ ఇంటిపై ఐటీ అధికారులు దాడులు చేశారు. ఆయన ఇల్లు, బంధువుల ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు నిర్వహిస్తున్నారు అధికారులు.
తెలంగాణ సీఎం కేసీఆర్ తీపికబురందించారు. రానున్న కాలంలో ఎకరానికి రూ. 16000వేలు ఇస్తామన్నారు. రానున్న రోజుల్లో రైతు బంధు 16వేలు రావాలంటే బీఆర్ఎస్ పార్టీని గెలిపించాలన్నారు. కొల్లాపూర్ లో ఏర్పాటు చేసిన ప్రజాఆశీర్వాద సభలో సీఎం ఈ వ్యాఖ్యలు చేశారు.