Adilabad: రహదారులు కావు.. మృత్యుదారులు
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రహదారులు దారుణంగా మారాయి. మూల మలుపులుగా ఉండే ఈ రహదారుల వల్ల అనేక మంది మృతి చెందారు. అంతే కాకుండా వాహనాలు అదుపు తప్పి పక్కనే ఉండే ఇళ్లలోకి దూసుకెళ్తున్నాయి.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రహదారులు దారుణంగా మారాయి. మూల మలుపులుగా ఉండే ఈ రహదారుల వల్ల అనేక మంది మృతి చెందారు. అంతే కాకుండా వాహనాలు అదుపు తప్పి పక్కనే ఉండే ఇళ్లలోకి దూసుకెళ్తున్నాయి.
జోగులాంబ గద్వాల జిల్లా అమరవాయి గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. కూలీ పని కోసం వెళ్లిన మహిళపై పిడుగు పడటం ఆమె అక్కడికక్కడే మృతి చెందింది.
మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేటలో బీసీలు బైక్ ర్యాలీ నిర్వహించారు. బీసీలకు రాజకీయ పార్టీల్లో ప్రాధాన్యత లేకుండా చేస్తున్నారన్నారు. రానున్న ఎన్నికల్లో బీసీలకు టికెట్లు ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు.
అందరూ ఉత్కంఠంగా ఎదురుచూస్తున్న బీఆర్ఎస్ అభ్యర్థుల జాబితా విడుదలైంది. ఆ పార్టీ అధినేత సీఎం కేసీఆర్ సోమవారం మధ్యాహ్నం ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను ప్రకటించారు. ఒక పది మంది మినహా అంతా సిట్టింగ్‌లకే మళ్లీ అవకాశం ఇచ్చారు. అయితే ఈ లిస్టులో అగ్రకులాలకే ఎక్కువ సీట్లు కేటాయించడం గమనార్హం.
నిర్మల్ నూతన మాస్టర్ ప్లాన్‌ను రద్దు చేయాలని కోరుతూ కొన్నిరోజులుగా మహేశ్వర్ రెడ్డి చేస్తున్న నిరాహార దీక్షను పోలీసులు భగ్నం చేశారు. సోమవారం తెల్లవారుజామున పోలీసులు బలవంతంగా ఆయనను ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ఆసుపత్రిలోనే దీక్ష కొనసాగిస్తున్నారు.
ప్రభుత్వం మాస్టర్ ప్లాన్‌ను వెంటనే వెనక్కి తీసుకోవాలని ఈటల రాజేందర్ డిమాండ్ చేశారు. మాస్టర్ ప్లాన్ పేరుతో రైతుల భూమి లాక్కుంటే వారు ఎలా జీవనం సాగిస్తారని ప్రశ్నించారు.
మంచిర్యాలలో రెండు రోజుల క్రితం సంభవించిన శరణ్య హత్యలో కొత్త అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. అక్రమ సంబంధమే ఈ హత్యకు నేపథ్యం అని, భర్త సుపారి ఇచ్చి ఆమెను చంపించాడని తెలుస్తోంది. దీనికి సంబంధించి RTV చేసిన పరిశోధనలో ఎన్నో కొత్త కోణాలు వెలుగు చూశాయి.
వర్షం ఆగిపోవడంతో నిర్మల్ జిల్లా కడెం ప్రాజెక్టుకు వరద ముప్పు తప్పింది. ప్రాజెక్టు పూర్తిస్తాయి నీటిమట్టం 700 అడుగులు ఉండగా.. ప్రస్తుత నీటిమట్టం 687 అడుగులగా ఉంది. మరోవైపు ప్రాజెక్టు మోటర్లు నాసిరకంగా ఉండడంతో వాటికి మరమ్మతులు చేస్తున్నారు అధికారులు.
తెలంగాణ రాష్ట్రాన్ని ముంచెత్తుతున్న భారీ వర్షాలతో ప్రాజెక్టులకు వరద ఉధృతి గంట గంటకు పెరుగుతూ పోతుంది. ఇక కడెం ప్రాజెక్టు డేంజర్ జోన్ లో పడింది. భారీగా ప్రాజెక్టులోకి వరద నీరు చేరుతుండడంతో.. ఏ క్షణంలో ఏదైనా జరగొచ్చు.. అని ప్రాజెక్ట్ వదిలి అధికారులు వెళ్ళిపోయారు. మరో పక్క ప్రాజెక్ట్ పై నుంచి వరద నీరు ప్రవహిస్తోంది. 4 గేట్లు మొరాయించగా.. కొన్ని గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పరిస్థితిని పరిశీలించి.. కడెం ప్రాజెక్ట్ ను ఆ ఎల్లమ్మ తల్లే కాపాడాలన్నారు.