సీఎం రేవంత్‌ రెడ్డిని కలిసిన గౌతమ్ అదానీ.. ఎందుకో తెలుసా ?

సీఎం రేవంత్‌ రెడ్డిని అదానీ గ్రూప్ యాజమాన్యం కలిసింది. గౌతమ్ అదానీ, కరన్ అదానీ కలిసి రేవంత్‌తో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ నేపథ్యంలో అదానీ ఫౌండేషన్‌.. స్కిల్ యూనివర్సిటీకి రూ.100 కోట్ల విరాళం ఇచ్చింది. ఇందుకు సంబంధించిన చెక్కును అందించింది.

gautam adani
New Update

సీఎం రేవంత్‌ రెడ్డిని అదానీ గ్రూప్ యాజమాన్యం కలిసింది. గౌతన్ అదానీ, కరన్ అదానీ కలిసి రేవంత్‌తో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. తెలంగాణ ప్రభుత్వం యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీని ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అదానీ ఫౌండేషన్‌.. స్కిల్ యూనివర్సిటీకి రూ.100 కోట్ల విరాళం ఇచ్చింది. ఇందుకు సంబంధించిన చెక్కును అందించింది. రంగారెడ్డి జిల్లా మీర్‌ఖాన్‌పేటలో స్కిల్ యూనివర్సిటీకి నిర్మాణం జరుగుతోంది. ఆగస్టు 1న దీనికి సీఎం రేవంత్ శంకుస్థాపన చేసిన సంగతి తెలిసిందే. 

Also Read: ఫుట్‌పాత్‌ ఆక్రమణలే టార్గెట్.. హైడ్రా నెక్ట్స్ యాక్షన్ ప్లాన్ ఇదే!

పెట్టుబడులకు సిద్ధంగా అదానీ గ్రూప్

రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రభుత్వం కొలువుదీరినప్పటి నుంచి వివిధ పరిశ్రమల ప్రతినిధులు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కలుస్తూ వస్తున్నారు. గతంలో ఫాక్స్‌కాన్, అమరరాజా ప్రతినిధులు ఇప్పటికే ఆయనతో భేటీ కాగా.. అదానీ గ్రూప్ ప్రతినిధులు కూడా ఈ ఏడాది జనవరిలోనే రేవంత్‌ను సచివాలయంలో కలిశారు. ఇందులో గౌతమ్ అదానీ కుమారుడు కరన్ అదానీ కూడా ఉన్నారు. తెలంగాణలో మరిన్ని పెట్టుబుడులు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లు అదానీ గ్రూప్ స్పష్టం చేసింది. దీనికి రేవంత్ కూడా స్వాగతించారు. 

Also Read: Isha ఫౌండేషన్‌కు సుప్రీంకోర్టులో భారీ ఊరట

దరఖాస్తులు ప్రారంభం

ప్రస్తుతం వివిధ రంగాల్లో విద్యార్థులకు నైపుణ్యాలను అందించి ఉద్యోగాలు కల్పించే దిశగా యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. దసరా సందర్భంగా అడ్మిషన్ల ప్రక్రియకు సంబంధించి నోటిఫికేషన్ కూడా విడుదలైంది. ఆసక్తిగల అభ్యర్థులు అక్టోబర్ 29 వరకు అప్లై చేసుకోవచ్చు. నవంబర్ 4నుంచి కోర్సులు మొదలుకానుండగా.. తొలి విడతగా 3 స్కూల్స్‌ ఏర్పాటు చేసి అందులో 4 కోర్సులను ప్రారంభించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. లాజిస్టిక్స్ అండ్ ఈ -కామర్స్ స్కూల్ కింద వేర్‌హౌస్ ఎగ్జిక్యూటివ్, కీ కన్సయినర్ ఎగ్జిక్యూటివ్ కోర్సులు, హెల్త్‌కేర్‌లో భాగంగా ఫినిషింగ్ స్కిల్స్ ఇన్ నర్సింగ్ ఎక్సలెన్స్, ఫార్మాస్యూటికల్స్ అండ్ లైఫ్ సైన్సెస్ కింద ఫార్మా అసోసియేట్ ప్రోగ్రామ్ కోర్సుల్లో చేరే విద్యార్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు.

Also Read: షేక్ హసీనాను మోదీ బంగ్లాదేశ్‌కి అప్పగిస్తారా?

స్కిల్ యూనివర్సిటీ ప్రస్తుతం నిర్మాణంలో ఉన్నందున అది పూర్తయ్యేవరకు హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజీ ఆఫ్ ఇండియా (ESCI) నేషనల్ అకాడమీ ఆఫ్ కన్‌స్ట్రక్షన్ క్యాంపస్‌లలో ఈ కోర్సులను నిర్వహించనున్నారు. ఈ ఏడాదికి 20 వేల మందికి ఈ కోర్సుల్లో అడ్మిషన్లు కల్పించనున్నారు. ఈ నేపథ్యంలనే ఆసక్తిగల అభ్యర్థులు ఈ యూనివర్సిటీలో చేరేందుకు దరఖాస్తులు చేసుకుంటున్నారు. 

Also Read: మందుబాబులకు గుడ్ న్యూస్

#cm-revanth #telugu-news #national-news #gautam-adani #young-india-skill-university
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe