Cinema workers' strike : సినీ కార్మికుల సమ్మెకు తెర..రేపటి నుంచి యాక్షన్‌ స్టార్ట్‌ ?

గడచిని 18 రోజులుగా సినీ కార్మికులు చేస్తున్న సమ్మెకు తెర పడింది. తమకు 30 శాతం వేతనాలు పెంచాలంటూ సినీ కార్మికుల ఫెడరేషన్  ఆధ్వర్యంలో ఆగస్టు 4 నుంచి సమ్మెకు దిగిన విషయం తెలిసిందే. ప్రభుత్వ పెద్దల జోక్యంతో సమస్యను పరిష్కరించుకునేందుకు ఇరువర్గాలు సమ్మతించాయి.

New Update
Cinema workers' strike

Cinema workers' strike close

Cinema workers' strike : గడచిని 18 రోజులుగా సినీ కార్మికులు చేస్తున్న సమ్మెకు తెర పడింది. తమకు 30 శాతం వేతనాలు పెంచాలంటూ సినీ కార్మికుల ఫెడరేషన్  ఆధ్వర్యంలో ఆగస్టు 4 నుంచి సమ్మెకు దిగిన విషయం తెలిసిందే. దీంతో గత 18 రోజులుగా టాలీవుడ్ లో అన్ని సినిమాలు, సీరియళ్లు, వెబ్ సిరీస్ ల షూటింగులు నిలిచిపోయాయి. చాలామంది ఇతర ప్రాంతాలకు వెళ్లి తమ షూటింగులు పూర్తి చేసుకుంటున్నారు. కాగా ఈ వివాదాన్ని పరిష్కరించడానికి అనేకసార్లు నిర్మాతలకు, ఫెడరేషన్ కు మధ్య చర్చలు జరిగినప్పటికీ అవేవీ కూడా సఫలం కాలేదు. చివరికి టాలీవుడ్‌ పెద్ద దిక్కుగా ఉన్న చిరంజీవి మధ్య వర్తిత్వం వహించిన సమస్యను పరిష్కరించలేక పోయాయి. దీంతో ఈ వివాదం మరింత తీవ్రమైంది. ఈ క్రమంలోనే లేబర్‌ కమిషన్‌ కూడా జోక్యం చేసుకుని కార్మికుల ఫెడరేషన్‌కు బిగ్‌షాక్‌ ఇచ్చింది. కార్మికుల ఫెడరేషన్ సభ్యత్వ నమోదు ఫీజులు, ఇప్పటి వరకు అందుకున్న చందాల వివరాలు పూర్తిగా సమర్పించాలని ఈ రోజు నోటీసులు జారీ చేసింది.

ఇది కూడా చదవండి:తెలంగాణ రైతులకు శుభవార్త.. కొత్త పాస్‌బుక్ వచ్చిన వారందరికీ ఈ నెలలో రైతు బీమా


ప్రభుత్వ జోక్యంతో...


ఇదిలా ఉండగా సమస్యను ఒక కొలిక్కి తెచ్చేందుకు FDC చైర్మన్ దిల్‌ రాజు, ఫిలిం ఛాంబర్ అధ్యక్షుడు రంగంలోకి దిగినట్లు తెలిసింది. వారి చొరవతో తెలంగాణ ప్రభుత్వం ఈ వివాదంలో జోక్యం చేసుకుంది. ప్రభుత్వ పెద్దల జోక్యంతో సమస్యను పరిష్కరించుకునేందుకు ఇరువర్గాలు సమ్మతించాయి. దీంతోపాటు లేబర్ కమిషన్ ప్రొడ్యూసర్లకు, ఫెడరేషన్ కు మధ్యవర్తత్వం వహించడంతో చర్చలు సఫలం అయినట్టు తెలుస్తోంది. ఈ విషయమై ఇరువర్గాలు మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించనున్నారు. చర్చలు సఫలం కావడంతో రేపటి నుంచి షూటింగ్స్ యథావిధిగా ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది.

Also Read: Rahul Gandhi: ఎవరు నచ్చకపోతే వాళ్ళను పంపేయొచ్చు..సీఎం, పీఎం 30 రోజుల జైలు బిల్లుపై రాహుల్ విమర్శ

Advertisment
తాజా కథనాలు