Mass Jathara Song: రవితేజ- శ్రీలీల జంటగా నటిస్తున్న మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ మాస్ జాతర నుంచి మరో అదిరిపోయే మాస్ బీట్ రిలీజ్ చేశారు మేకర్స్. 'సూపర్ డూపర్ హిట్ సాంగ్' అనే పేరుతో ఈ పాటను విడుదల చేశారు. ఇందులో శ్రీలీల, రవితేజ ఎనర్జిటిక్ స్టెప్పులతో అదరగొట్టారు. భీమ్స్ ఎనర్జిటిక్ మాస్ బీట్స్ ఫ్యాన్స్ లో ఫుల్ జోష్ నింపాయి. థియేటర్స్ లో మాస్ వేడుక తీసుకొస్తుందని తెలుస్తోంది. పాటలో హీరో, హీరోయిన్ కాస్ట్యూమ్స్, మాస్ అప్పీల్, విజువల్స్ ఆకట్టుకున్నాయి. విడుదలైన గంటల్లోనే మిలియన్ల వ్యూస్ తో దుమ్మురేపుతోంది. యూట్యూబ్ లో టాప్ 10 ట్రెండింగ్ లో ఒకటిగా దూసుకెళ్తోంది.
Here’s a #SuperDuper song for you all from #MassJathara !!https://t.co/Yn4TudMcql#MassJatharaOnOct31stpic.twitter.com/P22mSX0ztQ
— Ravi Teja (@RaviTeja_offl) October 22, 2025
రవితేజ వింటేజ్ వైబ్స్
భాను భోగవరపు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో రవితేజ పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నారు. ఇటీవలే మూవీ నుంచి టీజర్ విడుదలవగా.. పోలీస్ గెటప్ లో రవితేజ మాస్ యాక్షన్, డైలాగ్స్ వింటేజ్ వైబ్స్ అందించాయి. శ్రీలీల- రవితేజ మధ్య రొమాంటిక్ సన్నివేశాలు కూడా ఆకట్టుకున్నాయి. 'ధమాకా' మూవీ తర్వాత శ్రీలీల- రవితేజ కాంబినేషన్ లో వస్తున్న రెండవ సినిమా ఇది. 'ధమాకా ' సూపర్ హిట్ కావడంతో ఈ సినిమాపై కూడా అంచనాలు భారీగా ఉన్నాయి. విడుదలకు ముందే మంచి ప్రమోషనల్ స్టఫ్ తో సినిమాకు హైప్ పెంచుతున్నారు మేకర్స్.
సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ- సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో సీనియర్ నటులు రాజేంద్రప్రసాద్ రవితేజ తండ్రిగా కీలక పాత్ర పోషిస్తున్నారు.ప్రస్తుతం చిత్రీకరణ చివరి దశలో ఉన్న ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. రవితేజ రీసెంట్ ఫిల్మ్స్ 'ఈగల్', 'టైగర్ నాగేశ్వర్ రావు' సినిమాలు ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయాయి. దీంతో మాస్ జాతర విజయం రవితేజ కీలకమని భావిస్తున్నారు ప్రేక్షకులు. 57 ఏళ్ల వయసులో కూడా రవితేజ కుర్ర హీరోలకు పోటీగా సినిమాలు చేస్తూ అదరగొడుతున్నారు. ఆయన స్టైల్, మాస్ అప్పీల్ ఏ మాత్రం తగ్గలేదు.
Upasana Second Child: మెగా ఫ్యామిలీలో మరోసారి సందడి.. రెండో బిడ్డకు జన్మనివ్వబోతున్న ఉపాసన
Follow Us