హైడ్రా ఇళ్లు కూలుస్తుందనే భయంతో గుండెపోటుతో వ్యక్తి మృతి హైదరాబాద్‌లోని న్యూ తులసీరాంనగర్‌లో గానద శ్రీకుమార్ అనే వ్యక్తి నివసిస్తున్నాడు. హైడ్రా అధికారులు తన ఇల్లు కూల్చివేస్తారేమోనని గత 4 రోజులుగా మనస్థాపం చెందుతున్నాడు. తాజాగా అతనికి గుండెపోటు రావడంతో ఆస్పత్రికి తీసుకెళ్తుండగా మృతి చెందాడు. By B Aravind 02 Oct 2024 in తెలంగాణ హైదరాబాద్ New Update షేర్ చేయండి హైదరాబాద్‌లోని మూసీ పరివాహక ప్రాంతంలో విషాదం చోటుచేసుకుంది. తన ఇల్లును హైడ్రా అధికారులు కూల్చివేస్తారన్న భయంతో ఓ వ్యక్తి గుండెపోటుతో మృతి చెందడం కలకలం రేపుతోంది. ఇక వివరాల్లోకి వెళ్తే.. న్యూ తులసీరాంనగర్‌లో గానద శ్రీకుమార్ అనే వ్యక్తి నివసిస్తున్నాడు. గత నాలుగు రోజులుగా తన ఇల్లు కూల్చివేస్తారేమోనని అతడు మనస్థాపం చెందుతున్నాడు. తాజాగా అతనికి గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు. అయితే మార్గమధ్యంలోనే శ్రీకుమార్ మృతి చెందాడు. దీంతో తన ఇల్లు కూల్చివేస్తారన్న భయంతోనే ఇలా జరిగిందని అతని కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు ఆరోపిస్తున్నారు. ఇదిలాఉండగా.. ఇటీవల బుచ్చమ్మ అనే మహిళ కూడా తన ఇల్లు కూల్చివేస్తారేమోననే భయంతో ఆత్మహత్య చేసుకున్నట్లు ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. Also Read: అక్కా నోరు జాగ్రత్త.. మంత్రి కొండాకు సీఎం రేవంత్ వార్నింగ్! #hyderabad #telugu #hydra మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి