Bandi Sanjay :హైదరాబాద్ లో దాదాపు 60 వేల రోహింగ్యాలున్నారని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. చేవేళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి తాజాగా నలుగురు రోహింగ్యాలను పట్టుకున్నారని ఆయన గుర్తు చేశారు. గురువారం హైదరాబాద్ లో మీడియాతో చిట్ చాట్ చేశారు. ఈ రోహింగ్యాలంతా 2009లో వచ్చినవారేనని ఆయన అన్నారు. రంగారెడ్డి జిల్లాలో రోహింగ్యాలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కూడా ఇచ్చారని ఆయన అన్నారు.జీహెచ్ ఎంసీలో కాంగ్రెస్, ఎంఐఎంతో కలిసి పోటీచేస్తే ప్రజలే గుణపాఠం చెబుతారన్నారు. తాము మాత్రం ఒంటరిగానే పోటీ చేస్తామని ఆయన కుండబద్దలుకొట్టారు. భాగ్యనగర్ అభివృద్ధి చెందాలంటే ఏ పార్టీకి ఓటేయాలో ప్రజలకు తెలుసునని ఆయన ధీమా వ్యక్తం చేశారు.ఎంఐఎం ముక్త్ భారత్ కు బీజేపీ సిద్దంగా ఉందని చెప్పారు.గతంతో పోలిస్తే పంచాయతీ ఎన్నికల్లో సీట్లు, ఓట్లు అనూహ్యంగా పెరిగిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు.తన పార్లమెంట్ పరిధిలో 108 సర్పంచులను గెలవడంతోపాటు ఎక్కువ పంచాయతీల్లో రెండో స్థానంలో నిలిచిందన్నారు.
ఖైరతాబాద్ ఉపఎన్నిక కోసం ఎదురుచూస్తున్నామని ఆయన అన్నారు. జూబ్లీ హిల్స్ బైపోల్ లో పొరపాటున ఒక్క అడుగు వెనక్కి పడిందని ఆయన ఒప్పుకున్నారు. ఖైరతాబాద్ లో పులి పంజా విసిరినట్టు మేము తప్పకుండా పుంజుకుంటామని ఆయన ధీమాగా చెప్పారు. తెలంగాణకు కృష్ణా జలాల్లో 299 టీఎంసీలకు కేసీఆర్, చంద్రబాబు మధ్య జరిగిన రహస్య ఒప్పందం ఏంటని అపెక్స్ కౌన్సిల్ సమావేశంలోనే కేసీఆర్ ను జగన్ ప్రశ్నించారని ఆయన గుర్తు చేశారు.కృష్ణా జలాల విషయంలో కేసీఆర్ ఏమీ చేశారో ఆధారాలతో సహా బయట పెట్టింది తానేనని ఆయన అన్నారు.కృష్ణా జలాల గురించి మాట్లాడేహక్కు కేసీఆర్ కు లేదన్నారు.అప్పుడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు గా నేనే అపెక్స్ కౌన్సిల్ సమావేశం పెట్టించానని ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు.కాళేశ్వరం స్కాం నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు కేసీఆర్ కృష్ణ జలాలు ఇష్యూ తెస్తున్నారని ఆయన విమర్శించారు.కేసీఆర్ కుటుంబమే తెలంగాణ కు పెద్ద శని అని ఆయన విమర్శించారు.
కేసీఆర్ పై రేవంత్ రెడ్డి ఉపయోగించిన భాష సరైందికాదన్నారు. కేటీఆర్ అహంకారం తలకెక్కినట్టు మాట్లాడుతారని ఆయన విమర్శించారు. గతంలో కేసీఆర్ ఇలా మాట్లాడితే తామంతా ఖండించామన్నారు.రేవంత్ మాట్లాడిన తీరు ఆయనకే నష్టమని చెప్పారు. పార్టీ గుర్తు మీద జరిగే స్థానిక సంస్థల ఎన్నికలు ఎందుకు నిర్వహించడం లేదని ఆయన ప్రశ్నించారు. ఒక్కో గ్రామానికి 5 లక్షలు బిచ్చం వేస్తున్నారా అని ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఒక్కో గ్రామానికి కోటి ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.
గ్రామాలకు ఇచ్చేది కేంద్ర నిధులే అని బండి సంజయ్ చెప్పారు. కాంగ్రెస్ పార్టీ మీద ప్రజల్లో వ్యతిరేకత ఉందని ఆయన అన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తీవ్ర నైరాశ్యం లో ఉన్నారన్నారు.ఇద్దరు ముగ్గురు మంత్రులు బరితెగించి వేల కోట్లు సంపాదించుకుంటున్నారని ఆయన ఆరోపించారు.ఇదే విషయమై ఎమ్మెల్యేల్లో కూడా చర్చ ఉందని ఆయన అన్నారు. దీనిపై తాము కూడా విచారణ చేస్తున్నామని తెలిపారు. విచారణలో మంత్రుల పాత్ర తేలితే జైలుకు వెళ్లడం ఖాయమన్నారు. కాళేశ్వరం లక్ష కోట్ల స్కాం జరిగిందని ఆరోపించి... కేవలం సుందిళ్ళ, అన్నారం, మేడిగడ్డ మీదనే సీబీఐ విచారణ కోరారని కేంద్ర మంత్రి తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అవినీతికి వ్యతిరేకంగా, 6 గ్యారంటీల అమలు కోసం బీజేపీ పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తుందని మంత్రి తెలిపారు. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ చేసిన వ్యాఖ్యలను సుమోటోగా తీసుకొని స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని ఆయన కోరారు.
Bandi Sanjay : హైదరాబాద్ లో 60వేల రోహింగ్యాలు..బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు
హైదరాబాద్ లో దాదాపు 60 వేల రోహింగ్యాలున్నారని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. చేవేళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి తాజాగా నలుగురు రోహింగ్యాలను పట్టుకున్నారని ఆయన గుర్తు చేశారు. గురువారం హైదరాబాద్ లో మీడియాతో చిట్ చాట్ చేశారు.
Bandi Sanjay Sensational Comments