/rtv/media/media_files/2025/03/06/TFcc9LDAyhXRJ5OhEeiK.jpg)
Nalgonda Kidnap
Nalgonda Kidnap : నల్గొండ ప్రభుత్వాసుపత్రి సమీపంలో పట్టపగలే మూడేళ్ల బాలుడి కిడ్నాప్ కలకలం రేపింది. ఆడుకుంటున్న బాలుడిని కిడ్నాపర్ ఎత్తుకెళ్లాడు. సీసీ కెమెరాలో బాలుడి కిడ్నాప్ దృశ్యాలు రికార్డయ్యాయి. ఈ నెల 4న కిడ్నాప్ కాగా, విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులకు బాలుడి తల్లిదండ్రుల ఫిర్యాదు చేశారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు విచారణ చేపట్టారు. సీసీ ఫుటేజ్ ద్వారా నిందితుడిని గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు.
Also Read: This Week Movies: మహాశివరాత్రి స్పెషల్.. థియేటర్, ఓటీటీలో సినిమాల జాతర! లిస్ట్ ఇదే
నల్లగొండకు చెందిన అహ్మద్, షమీమున్నిసా బేగం దంపతులు కొన్నేళ్లుగా ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో ఉంటున్నారు. వీరికి మూడేళ్ల అబ్దుల్ రహమాన్ అనే బాలుడు ఉన్నాడు. చిన్నచిన్న కూలీ పనులు చేస్తూ.. ప్రభుత్వం అందించే ఐదు రూపాయల భోజనంతో పూట గడుపుకుంటున్నారు. ఈనెల 4వ తేదీన ఆస్పత్రి ఆవరణలో కొత్తగా నిర్మిస్తున్న వాటర్ ట్యాంక్ ప్రాంతంలో అబ్దుల్ రహమాన్ ఆడుకుంటూ కనిపించకుండా పోయాడు. దీంతో బాలుడు తల్లిదండ్రులు.. హాస్పిటల్ ఆవరణలో వెతికినా.. ఆచూకీ లభించలేదు. బాలుడిని ఎత్తుకెళ్లిన గుర్తు తెలియని దుండగుడి దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి.
Also Read: DIL Raju: విజయ్ సినిమాపై నోరు జారిన దిల్ రాజ్.. వెంటనే సోషల్ మీడియాలో అనౌన్స్మెంట్
-
వెంటనే బాలుడు తల్లిదండ్రులు టూ టౌన్ పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు.. హాస్పిటల్ ఆవరణలోని సీసీ ఫుటేజీని పోలీసులు పరిశీలించారు. ఈ ఫుటేజీలో నాలుగవ తేదీ మధ్యాహ్నం సమయంలో ఫోన్ మాట్లాడుకుంటూ హాస్పిటల్ ఆవరణలోకి ఓ దుండగుడు వచ్చాడు. అక్కడే ఆడుకుంటున్న అబ్దుల్ రహమాన్ ను ఎత్తుకెళ్లినట్లు ఫుటేజీలో స్పష్టంగా కనిపించింది. దీంతో ఆ దుండగుడుని పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఒకటి రెండు రోజుల్లో దుండగుడిని పట్టుకొని బాలుడిని క్షేమంగా తీసుకువస్తామని పోలీసులు చెబుతున్నారు.
మరో ఘటనలో వైవాహిక జీవితంలో గొడవల కారణంగా మనస్తాపం చెంది తన ఇద్దరు పిల్లలతో కలిసి అదృశ్యమైన మహిళ ఆచూకీని అర్ధగంటలో కనగల్ పోలీసులు కనిపెట్టారు. నల్లగొండ మండలం జి. చెన్నారం గ్రామానికి చెందిన కాలం నాగజ్యోతి వైవాహిక జీవితంలో గొడవల కారణంగా జీవితంపై విరక్తి చెంది మంగళవారం మధ్యాహ్నం తన ఇద్దరు పిల్లల్ని తీసుకొని ఎవరికీ చెప్పకుండా ఇంట్లో నుంచి వెళ్లిపోయింది.
ఇది కూడా చూడండి: Agent OTT Date: హమ్మయ్య.. రెండేళ్ల తర్వాత OTTలోకి అయ్యగారి సినిమా.. అక్కినేని ఫ్యాన్స్ సంబరాలు!
జ్యోతి భర్త, తల్లిదండ్రులు చుట్టుపక్కల ఎంత వెతికినా ఆచూకీ లభించకపోవడంతో బుధవారం సాయంత్రం కనగల్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఎస్‌ఐ విష్ణుమూర్తి పోలీసులను రెండు టీంలుగా విభజించి దర్యాప్తు చేస్తున్న క్రమంలో నాగజ్యోతి అన్న మొబైల్‌కు కొత్త నంబర్ నుంచి నాగజ్యోతి ఫోన్ చేసి “నేను చనిపోతున్నాను. నా గురించి ఎవరూ వెతకొద్దు, నేను పిల్లల్ని తీసుకొని చనిపోతున్నాను’ అని చెప్పి ఫోన్ కట్ చేసింది.
ఇది కూడా చూడండి: Railway Jobs: రైల్వేలో మరో 835 పోస్టులు.. త్వరగా దరఖాస్తు చేసుకోండి!
ఈ విషయం ఆమె అన్న వెంటనే కనగల్ పోలీసులకు చెప్పడంతో ఆ నంబర్‌ను ట్రేస్ చేసి నాగజ్యోతి హైదరాబాద్‌లో ఉందని నిర్ధారించుకొని హయత్‌నగర్ పోలీసుల సహకారంతో నాగజ్యోతి ఆచూకీని అరగంటలో కనిపెట్టి ఆమెను క్షేమంగా వారి బంధువులకు హయత్‌నగర్‌లో అప్పగించారు. నాగజ్యోతి బంధువులు కనగల్ ఎస్‌ఐ విష్ణుమూర్తి, పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు.
Also read: live longer: అందరికన్నా వీళ్లు మూడేళ్లు ఎక్కువ జీవిస్తారు.. ఎందుకంటే?