/rtv/media/media_files/2025/11/10/jubilee-hills-2025-11-10-07-23-49.jpg)
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారం ముగిసింది. ఇక రాజకీయ పార్టీలు ఓటర్లను ప్రలోభ పెట్టడానికి అకరి అస్త్రంగా డబ్బులు, చీరలు, మద్యం వంటివి పంచుతున్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీకి ఈ ఎన్నికలు పోటాపోటీగా ఉన్నాయి. దీంతో అభ్యర్థులు ఎలాగైనా ఎమ్మెల్యేగా గెలవాలని ప్రయత్నిస్తున్నారు. జూబ్లీహిల్స్ ఏడు డివిజన్‌లో ప్రచారానికి మంత్రులు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు అందర్ని దింపారు.
షేక్ పేట్ డివిజన్ ఎల్లారెడ్డిగూడలో బహిరంగంగా డబ్బులు పంపిణీ
— Telugu Scribe (@TeluguScribe) November 9, 2025
ఇంట్లోకి వెళ్ళి చీరలు, డబ్బులు పంపిణీ చేస్తున్న కాంగ్రెస్ కార్యకర్తలు pic.twitter.com/PhSad8Twwx
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఎలాగైనా గెలవాలని పార్టీలకు ప్రలోభాలకు దిగాయి. నియోజకవర్గ ఓటర్లు తమ పార్టీకి ఓటు వేసేందుకు ఓటర్లకు డబ్బులు పంచే కార్యక్రమాలను మొదలుపెట్టారు. షేక్‌పేట డివిజన్ ఎల్లారెడ్డిగూడలో బహిరంగంగానే డబ్బుల పంపిణీని ప్రారంభించింది. ఆయా పార్టీ కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి చీరలు, డబ్బులు పంపిణీ చేస్తున్నారు.
బ్రేకింగ్ న్యూస్
— Telugu Scribe (@TeluguScribe) November 9, 2025
ఎర్రగడ్డలో కాంగ్రెస్ నాయకులు డబ్బులు పంపిణీ చేస్తున్నారనే సమాచారంతో హోటల్ పాలక్‌పై రైడ్ చేసిన పోలీసులు
దాదాపు 11 మంది అరెస్ట్.. పోలీస్ స్టేషన్‌కు తరలింపు pic.twitter.com/PHylNeXV4a
మరోవైపు ఎర్రగడ్డలోనూ అధికార పార్టీ నాయకులు భారీగా డబ్బులు పంచేందుకు సిద్ధమయ్యారు. దీనికోసం హోటల్ పాలక్‌లో సమావేశమయ్యారనే సమాచారం తెలిసిన పోలీసులు రైడ్ చేశారు. దాదాపు 11 మందిని అరెస్టు చేసి, పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
Follow Us