ఇటీవల కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వక్ఫ్ చట్ట సవరణ బిల్లును తెలంగాణ రాష్ట్ర వక్ఫ్ బోర్డ్ వ్యతిరేకించింది. రాష్ట్ర వక్ఫ్ బోర్డు ఛైర్మన్ అజ్మతుల్లా హుస్సేనీ నేతృత్వంలో సోమవారం సమావేశం నిర్వహించారు. అయితే మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ బిల్లు వక్ఫ్ సంస్థలను దెబ్బతీసేలా ఉందని బోర్డు అభిప్రాయం వ్యక్తం చేసింది. అందుకే దీనిని వ్యతిరేకిస్తున్నట్లు పేర్కొంది.
Also Read: ఘోర రోడ్డు ప్రమాదం.. స్పాట్‌లో ఐదుగురు మృతి
మరోవైపు వక్ఫ్ చట్ట సవరణ బిల్లు తిరస్కరణకు మద్దతిచ్చిన ముఖ్యమంత్రి రేవంత్‌కు హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్ర వక్ఫ్ బోర్డు ఛైర్మన్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఓవైసీతో పాటు బోర్డు సభ్యులు పాల్గొన్నారు.