Paris Olympics: తెలంగాణ బిడ్డకు కఠినమైన డ్రా

ఒలింపిక్స్‌లో బరిలో దిగుతున్న క్రీడాకారుల్లో తెలంగాణ తేజం నిఖత్ జరీన్ కూడా ఉన్నారు. బాక్సింగ్ లో తన సత్తా చాటుకోవడానికి ఉవ్విళూరుతున్న నిఖత్‌కు కఠిన డ్రా లభించింది.

New Update
Paris Olympics: తెలంగాణ బిడ్డకు కఠినమైన డ్రా

ఒలింపిక్స్‌లో 50 కేజీల బాక్సింగ్ ఈవెంట్‌ డ్రాను నిర్వాహకులు విడుదల చేశారు. తెలంగాణ నుంచి ఇందులో పార్టిసిపేట్ చేస్తున్న నిఖత్ జరీన్‌కు కఠినమైన డ్రా ఎదురైంది. మొదటి రౌండ్‌లో జర్మనీ సంచలనం కరీనా క్లొయెట్జర్ తో నిఖత్ తలపడనుంది. అందులో గెలిస్తే రెండో రౌండ్‌లో ప్రపంచ ఛాంపియన్ షిప్ గోల్డ్ మెడల్ విజేత వ యూ తో తలపడుతుంది నిఖత్. ఈ రెండు రౌండ్‌లూ ఆమెకు కఠిన సవాళ్ళనే చెప్పాలి. ఇవి కనుక గెలిస్తే మాత్రం పతకం రావడం ఖాయం.

నిఖత్ జరీన్‌కే కాదు మరో భార‌త మ‌హిళా బాక్స‌ర్, టోక్యో ఒలింపిక్ కాంస్య ప‌తక విజేత లోవ్లినా బోర్గోహైన్‌కు కూడా కష్ట‌మైన డ్రా ల‌భించింది. 75 కేజీల విభాగంలో తొలి రౌండ్‌లో నార్వేకు చెందిన సున్నివా హాఫ్‌స్టాడ్‌తో లోవ్లినా త‌ల‌ప‌డ‌నుంది. ఒకవేళ ఆమె ఫ‌స్ట్ రౌండ్‌లో విజ‌యం సాధిస్తే.. రెండు సార్లు ఒలింపిక్స్ మెడ‌లిస్ట్, చైనా స్టార్ బాక్స‌ర్ లి కియాన్‌తో అమీతుమీ తెల్చుకుంటుంది లోవినా.

Also Read:Paris Olympics: ఒలింపిక్ వేడుకల చిత్రాలు మరిన్ని…

Advertisment
తాజా కథనాలు