Telangana: తెలంగాణలో వరద నష్టం రూ.5,438 కోట్లు.. శాఖల వారీగా లెక్కలివే!

వరద ప్రభావానికి తెలంగాణలో భారీగా నష్టం వాటిల్లింది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం రూ.5,438 కోట్ల నష్టం జరిగినట్లు అధికారులు ప్రాథమిక అంచనా వేశారు. శాఖల వారిగా నష్టం వివరాలు వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా రూ.415 కోట్ల పంట నష్టం జరిగినట్లు పేర్కొన్నారు.

Telangana: తెలంగాణలో వరద నష్టం రూ.5,438 కోట్లు.. శాఖల వారీగా లెక్కలివే!
New Update

భారీ వర్షాల వల్ల వరద పోటెత్తడంతో తెలుగు రాష్ట్రాలు అతాలాకుతలమైన సంగతి తెలిసిందే. వరద ప్రభావానికి తెలంగాణలో భారీగా నష్టం వాటిల్లింది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం రూ.5,438 కోట్ల నష్టం జరిగినట్లు అధికారులు ప్రాథమిక అంచనా వేశారు. శాఖల వారిగా నష్టం వివరాలు వెల్లడించారు.
నష్టం వివరాలు
రోడ్లు, భవనాలు- రూ.2,362 కోట్లు నష్టం
మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్- రూ.1,150 కోట్లు నష్టం
నీటిపారుదల శాఖ- రూ.629 కోట్లు నష్టం
పంట నష్టం- 4.15 లక్షలు ఎకరాల్లో రూ.415 కోట్లు నష్టం
విద్యుత్ శాఖ- రూ.175 కోట్లు
పంచాయతీ రాజ్ శాఖ- రూ.170 కోట్లు
పశు సంవర్థక శాఖ- రూ.25 కోట్లు
వైద్య, ఆరోగ్య శాఖ- రూ.12 కోట్లు
ఇతర శాఖలు, ప్రజల ఆస్తుల నష్టం రూ.500 కోట్లు

publive-image

Also Read: వయస్సు చిన్నది.. మనస్సు పెద్దది

నష్టపోయిన రైతులు

రాష్ట్రవ్యాప్తంగా 22 జిల్లాల్లోని 131 మండలాల పరిధిలో 999 గ్రామాల్లో 4.15 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగిందని వ్యవసాయ శాఖ ప్రాథమిక అంచనా వేసింది. మొత్తంగా రూ.415 కోట్లు నష్టం వాటిల్లినట్లు పేర్కొంది. అత్యధికంగా వరికి 1.80 లక్షల ఎకరాల్లో, పత్తికి రూ.1.06 లక్షల ఎకరాలు, మొక్కజొన్నకు 20 వేలకు పైగా ఎకరాల్లో నష్టం జరగిందని వెల్లడించింది. వీటితో పాటు మిర్చి, కందులు, సోయా, పెసర, మినుములు, కూరగాయలు ఇతర పంటలు సైతం దెబ్బతిన్నట్లు తెలిపింది. ఈ మేరకు పంట నష్టానికి సంబంధించిన నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది.

ఖమ్మం, మహబూబాబాద్, సూర్యాపేట జిల్లాల్లో ఎక్కువ శాతం పంటలు దెబ్బతిన్నాయి. భద్రాద్రి కొత్తగూడెం, నారాయణపేట, వరంగల్, సిద్దిపేట, కామారెడ్డి, ఆదిలాబాద్, తదితర జిల్లాల్లో కూడా నష్టం జరిగింది. దీంతో మొత్తం 85,323 రైతులు నష్టపోయారు. అత్యధికంగా ఖమ్మంలో 46,374 మంది, మహబూబాబాద్ జిల్లాలో 18,089 మంది, సూర్యాపేటలో 9,227 మంది రైతులకు పంట నష్టం జరిగింది.

మరోవైపు భారీ వర్షాల వల్ల పంటల్లో నీటి నిల్వ ఉంటుందని దీనివల్ల చీడపీడల బెడత పెరుగుతుందని తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీ రైతులకు హెచ్చరించింది. దీన్ని నివారించేందుకు ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించింది. ముఖ్యంగా వరి, మొక్కజొన్న, పత్తి, సోయాచిక్కుడు, కంది, పెసర, మినుములకు కొన్ని రకాల చీడపీడలు అధికంగా వచ్చే ఛాన్స్ ఉందని పేర్కొంది. ఇందుకోసం ముందస్తు చర్యలు చేపట్టడం వల్ల పంట నష్టాల నుంచి కాపాడుకోవచ్చని తెలిపింది.

#telangana #telugu-news #heavy-rains #floods
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి