Telangana: నేడు రాష్ట్ర గవర్నర్ గా జిష్ణుదేవ్ ప్రమాణ స్వీకారం

తెలంగాణ కొత్త గవర్నర్‌గా జిష్ణుదేవ్ వర్మ ఈరోజు సాయంత్రం 5గంటలకు ప్రమాణస్వీకారం చేస్తారని రాజ్‌భవన్ ప్రకటించింది. రెండు రోజుల క్రితమే జిష్ణుదేవ్‌ను గవర్నర్‌గా నియమించారు. ఆయనతో పాటూ మరో తొమ్మిది రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం గవర్నర్లను నియమించింది.

Telangana: నేడు రాష్ట్ర గవర్నర్ గా జిష్ణుదేవ్ ప్రమాణ స్వీకారం
New Update

New Governer Jishnu Dev Varma: తెలంగాణ గర్నవర్‌గా నియామకమైన జిష్ణుదేవ్ వర్మ ఈరోజు పదవీ ప్రమాణస్వీకారం చేయనున్నారు. రాజ్‌భవన్‌లో బుధవారం సాయంత్రం 5.03 గంటలకు ఆయన గవర్నర్‌గా పదవీ బాధ్యతలు చేపట్టనున్నట్లు రాజ్‌భవన్‌ పేర్కొంది. రెండురోజుల కిందట కేంద్ర ప్రభుత్వం 9 రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను నియమించిన విషయం తెలిసిందే. జిష్ణుదేవ్ వర్మ 2018 నుంచి 2023 వరకూ త్రిపుర రాష్ట్ర డిప్యూటీ సీఎంగా పని చేశారు.

1957 ఆగస్టు 15న స్వాతంత్ర దినోత్సవం రోజున జిష్ణుదేవ్ వర్మ జన్మించారు. అంతేకాదు గతంలో బాడ్మింటన్ అసోషియేషన్ ఆఫ్ ఇండియాకు అధ్యక్షుడిగా సేవలందించారు. ఈయన త్రిపుర రాజ కుటుంబానికి చెందిన వ్యక్తి కాగా.. రామ జన్మభూమి ఉద్యమ సమయంలో పార్టీ క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న సమయంలో పార్టీలో 1990లో చేరారు. ఆయన అప్పటి నుంచి ఆ పార్టీలో కీలకంగా వ్యవహరిస్తూ వచ్చారు. త్రిపుర ప్రభుత్వంలో ఆయన మంత్రిగా విద్యుత్, గ్రామీణాభివృద్ధి, పంచాయితీ రాజ్, ఆర్ధిక, ప్రణాళిక, సైన్స్ అండ్ టెక్నాలజీ, పర్యావరణ శాఖల బాధ్యతలను నిర్వర్తించారు.

Also Read:National: ఆగస్టు 5 నుంచి రాష్ట్రపతి విదేశీ పర్యటన

#telangana #jishnu-dev-varma #oath #governer
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe