National: ఆగస్టు 5 నుంచి రాష్ట్రపతి విదేశీ పర్యటన

భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. వచ్చే నెలలో విదేశీ పర్యటన చేయనున్నారు. ఆగస్ట్ 5వ తేదీ నుంచి ఫిజీ, న్యూజిలాండ్, తూర్పు తిమూర్ దేశాల్లో ఆమె పర్యటించనున్నారు. దానికన్నా ముందు ఆగస్టు 2,3 తేదీల్లో రాష్ట్రపతి భవన్‌లో ముర్ము రాష్ట్ర గవర్నర్లను మీట్ అవ్వనున్నారు.

New Update
National: ఆగస్టు 5 నుంచి రాష్ట్రపతి విదేశీ పర్యటన

Rashtrapathi Dorupadi Murmu: ఆగస్ట్ 5 నుంచి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆరు రోజుల పాటూ విదేశీ పర్యటన చేయనున్నారు. ఈ విదేశీ టూర్‌లో మొదటగా రాష్ట్రపతి ఫిజీకి చేరుకుంటారు. ఈ పర్యటనలో ఆ దేశాధ్యక్షుడు విలియమ్ కటోనివెరే‌తోపాటు ఆ దేశ ప్రధాన మంత్రి సితివేణి రబుకా‌తో జరిపే దైపాక్షిక చర్చల్లో రాష్ట్రపతి ముర్ము పాల్గొంటారు. ఫిజీ పార్లమెంట్‌లో ఆ దేశ సభ్యులనుద్దేశించి ఆమె ప్రసంగించనున్నారు. ఆ దేశంలో స్థిరపడిన భారతీయ సంతతితో రాష్ట్రపతి ముర్ము సమావేశం కానున్నారు. ఫిజీని సందర్శిస్తున్న తొలి భారత రాష్ట్రపతి ముర్మునే కానున్నారు.

అనంతరం ఆగస్ట్ 7న రాష్ట్రపతి ముర్ము న్యూజిలాండ్‌ చేరుకుంటారు. ఈ పర్యటనలో భాగంగా ఆ దేశ గవర్నర్ జనరల్ సిండి కైరో, ప్రధాని క్రిస్టఫర్ లక్సన్‌తో రాష్ట్రపతి ముర్ము ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. ఇక న్యూజిలాండ్‌లో ఆ ప్రభుత్వం ఏర్పాటు చేసే విద్యా సదస్సులో సైతం ఆమె పాల్గొని ప్రసంగించనున్నారు. ఆ తర్వాత.. ఆ దేశంలో స్థిరపడిన భారతీయులతో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము భేటీ కానున్నారు.
ఆగస్టు 10న తూర్పు తిమూరుకు రాష్ట్రపతి ముర్ము చేరుకుంటారు. ఈ సందర్భంగా ఆ దేశాధ్యక్షుడు జోస్ రామోస్ హోర్తా, ప్రధాని క్సానానా గుస్మావోతో ఆమె సమావేశమవుతారు. ఈ మేరకు భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో వెల్లడించింది.

2,3 తేదీల్లో గవర్నర్లతో మీటింగ్..

ఆగస్టు 2, 3 తేదీల్లో రాష్ట్రపతి భవన్‌లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అధ్యక్షతన గవర్నర్ల సదస్సు జరగనుంది. ఈ సమావేశానికి ఉపరాష్ట్రపతి జగదీప్ దంకర్, ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర మంత్రులు హాజరు కానున్నారు. ఇందులో నూతన నేర న్యాయ చట్టాలు, ఉన్నత విద్యలో సంస్కరణలు, యూనివర్సిటీలు అక్రిడేషన్, గిరిజన ప్రాంతాల అభివృద్ధి, వెనుకబడిన జిల్లాలు- సరిహద్దు ప్రాంతాల అభివృద్ధిలో గవర్నర్ల పాత్ర.. మై భారత్, ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్, ఏక్ వృక్ష మాకే నామ్, సేంద్రియ వ్యవసాయం, ప్రజా సంబంధాల మెరుగుదల, రాష్ట్రంలోని కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలతో మెరుగైన సమన్వయం వంటి కీలక అంశాలపై రెండు రోజుల పాటు చర్చలు జరగనున్నాయి.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు