TG News: సీఎంతో కొత్త ఎమ్మెల్సీలు భేటీ- VIDEO

ఇటీవల గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా ఎన్నికైన కోదండరాం, అమీర్ అలీఖాన్ సీఎం రేవంత్‌ను ఈ రోజు మర్యాదపూర్వకంగా కలిశారు. రేవంత్ రెడ్డి వారిద్దరిని అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. వీరివెంట డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్కతోపాటు పలువురు ఎమ్మెల్యేలు ఉన్నారు.

New Update
TG News: సీఎంతో కొత్త ఎమ్మెల్సీలు భేటీ- VIDEO

Telangana: శాసనమండలి సభ్యులుగా ఇటీవలే బాధ్యతలు చేపట్టిన ప్రొఫెసర్ కోదండరాం, ఆమిర్ అలీ ఖాన్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిశారు. మంగళవారం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో సీఎంతోపాటు డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్కను కలిసి పుష్పగుచ్చం అందించారు. ఈ క్రమంలో నూతన ఎమ్మెల్సీలను సీఎం, డిప్యూటీ సీఎంలు అభినందించారు. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ఎమ్మెల్యేలు మందుల సామేల్, రేకులపల్లి భూపతిరెడ్డి ఈ భేటీలో పాల్గొన్నారు.

అయితే ఎమ్మెల్సీలుగా కోదండరాం, అమీర్ అలీఖాన్ పేర్లను ఆనాడు తెలంగాణ రాష్ట్రానికి గవర్నర్ తమిళిసైకి కాంగ్రెస్ సర్కార్ ప్రతిపాదించింది. ఈ క్రమంలో వారిని ఎమ్మెల్సీలుగా నామినేట్ చేస్తూ తమిళిసై ప్రకటన చేశారు. ఇదే అంశంపై హైకోర్టులో పిటిషన్ వేశారు బీఆర్ఎస్ నేతలు దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణ. వారి పిటిషన్ పై విచారించిన ధర్మాసనం ఎన్నికపై స్టే విధించింది. దీంతో గవర్నర్ కోటాలోని రెండు స్థానాలు పెండింగ్ లో ఉండిపోయాయి.

రేవంత్ సర్కార్‌కు సుప్రీంకోర్టులో ఇటీవల భారీ ఊరట లభించింది. గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీల నియామకలపై సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీల నియామకానికి గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది సుప్రీం కోర్టు. హైకోర్టు ఇచ్చిన ఆర్డర్‌పై స్టే విధించింది. కొత్తగా నియామకాలు చేపట్టకుండా ఆదేశాలు ఇవ్వాలని సుప్రీంకోర్టులో బీఆర్ఎస్ నేతలు దాసోజు శ్రవణ్‌, కుర్రా సత్యనారాయణ సుప్రీం కోర్టులో పిటిషన్‌ వేశారు. దాసోజు తరఫున కపిల్‌ సిబల్‌ వాదించారు. వారి వేసిన పిటిషన్లను సుప్రీం కోర్టు తిరస్కరించింది. కొత్త నియామకాలు ప్రభుత్వ బాధ్యతని ధర్మాసనం స్పష్టం చేసింది. గవర్నర్ నామినేట్ చేయడాన్ని అడ్డుకోలేమని ధర్మాసనం పేర్కొంది. తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది. తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు హైకోర్టు ఆదేశాలపై స్టే ఉంటుందని జస్టిస్‌ విక్రంనాథ్‌ ధర్మాసనం ఆదేశాలు ఇచ్చింది.

Also Read : తెలంగాణలో రుణమాఫీపై రచ్చ.. ఎవరి వాదన కరెక్ట్?
Advertisment
తాజా కథనాలు