MLC Elections: ఎమ్మెల్సీ ఎన్నిక.. కాంగ్రెస్ నేతల ఆశలు!

తెలంగాణ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది. దీంతో కాంగ్రెస్ లో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ ఆశించి భంగపడ్డ నేతలు, ఓడిపోయిన అభ్యర్థులు దాదాపు 12 మంది ఈ ఎన్నికలపై ఆశలు పెట్టుకున్నారు. తమకు అవకాశం కల్పించాలని హైకమాండ్ ను వారు కోరుతున్నారు.

Telangana Congress: పార్లమెంట్ ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ కమిటీ భేటీ
New Update

Telangana MLC By-Elections: తెలంగాణలో ఎమ్మెల్యే కోటాలో ఖాళీ అయిన రెండు స్థానాలకు ఈ నెల 29న పోలింగ్​ జరగనుంది. ఎమ్మెల్సీ ఉప ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం (Election Commission) షెడ్యూల్ రిలీజ్ చేసింది. ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీలుగా (MLA MLC Seats) ఉన్న కడియం శ్రీహరి (Kadiyam Srihari) స్టేషన్​ఘన్​పూర్ నుంచి, పాడి కౌశిక్ రెడ్డి (Padi Koushik Reddy) హుజూరాబాద్ నుంచి ఎమ్మెల్యేలుగా గెలుపొందారు.

ALSO READ: 100 ఎకరాల్లో తెలంగాణ కొత్త హైకోర్టు భవనం

వాళ్లు ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేయడంతో ఆ సీట్లు ఖాళీ అయ్యాయి. వారిద్దరి పదవీకాలం 2027 నవంబర్​30 వరకు ఉండటంతో ఉప ఎన్నికలకు ఈసీ షెడ్యూల్​ రిలీజ్​ చేసింది. ఈ నెల 11న నోటిఫికేషన్​ జారీ చేయనుంది. 18 వరకు నామినేషన్లకు గడువు ఉంటుంది. 19న స్క్రూటినీ చేస్తారు. 22 వరకు ఉపసంహరణకు గడువు ఉంటుంది. 29న పోలింగ్​నిర్వహించి .. అదే రోజు 5 గంటల నుంచి ఓట్లు లెక్కించి విజేతలను ప్రకటిస్తారు.

ఎమ్మెల్సీ టికెట్.. నేతల ఆశలు

ఎమ్మెల్యే కోటాలో ఖాళీ అయిన రెండు ఎమ్మెల్సీ స్థానాలకు కాంగ్రెస్‌ పార్టీలో (Congress Party) ఆశావహుల్లో ఉత్కంఠ నెలకొంది. ప్రస్తుతం రెండు స్థానాలల్లో పార్టీల బలాబలాలను బట్టి.. రెండు ఎమ్మెల్సీల్లో ఒకటి అధికార కాంగ్రెస్ కు దక్కే అవకాశం ఉంది. దీంతో అసెంబ్లీ ఎన్నికల సమయంలో హామీలు పొందిన వారు, ఎన్నికల్లో పరాజితులైన వారు, సీనియర్‌ నాయకులు తీవ్రంగా పోటీ పడుతున్నారు. పదేళ్ల తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ లో ఆశావహుల సంఖ్య భారీగానే ఉంది.

రేసులో అద్దంకి దయాకర్..

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమకు అవకాశం కల్పించాలని హైకమాండ్ ను టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్లు మహేష్‌ కుమార్‌గౌడ్‌, జగ్గారెడ్డి, సీనియర్‌ నేత హర్కారే వేణుగోపాల్‌ కోరుతున్నట్లు సమాచారం. మైనారిటీ వర్గానికి ప్రాతినిథ్యం కల్పించాలని అధిష్ఠానం నుంచి సంకేతాలు ఉన్నందున తమ పేర్లు పరిశీలించాలని షబ్బీర్‌ అలీ, అజారుద్దీన్‌, ఫెరోజ్‌ఖాన్‌ కోరుతున్నట్లు తెలిసింది. ఇటీవలి ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల విజయం కోసం కృషి చేసిన మైనారిటీ వర్గం నేతలు షబ్బీర్‌ పీర్‌ అహ్మద్‌, అలీ మస్కతీ పేర్లు సైతం వినిపిస్తున్నాయి. వీరితోపాటు సీఎం రేవంత్‌రెడ్డికి (CM Revanth Reddy) సన్నిహితుడైన వేం నరేందర్‌రెడ్డి, అద్దంకి దయాకర్‌, బండ్ల గణేష్‌ తదితరులు తమకు అవకాశం కల్పించాలని ఇప్పటికే అధిష్ఠానానికి అభ్యర్థనలు పంపినట్టుసమాచారం.

ALSO READ: వారికి టికెట్ వద్దు.. జగన్ కు మాజీ సీఎం కేసీఆర్ సలహాలు!

#cm-revanth-reddy #congress-party #telangana-mlc-elections #telangana-latest-news
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe