Medaram : మేడారం జాతరకు జాతీయ హోదా తెచ్చుకుందాం.. అధికారులతో మంత్రి సీతక్క సమీక్ష

మేడారం జాతరను వైభవంగా; తెలంగాణ, గిరిజన సాంస్కృతిక వైభవాన్ని చాటేలా నిర్వహించాలని మంత్రి సీతక్క అధికారులను ఆదేశించారు. జాతర నిర్వహణపై హైదరాబాద్ లో గిరిజన సంక్షేమశాఖ కార్యాలయంలో ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు.

Medaram : మేడారం జాతరకు జాతీయ హోదా తెచ్చుకుందాం.. అధికారులతో మంత్రి సీతక్క సమీక్ష
New Update

Medaram Jatara : తెలంగాణ(Telangana) కు తలమానికమైన మేడారం జాతర దగ్గరలోనే ఉంది. రెండేళ్లకోసారి జరిగే ఈ జాతర కుంభమేళాను తలపిస్తుంది. కోట్లాదిగా భక్తులు తరలివచ్చి సమ్మక్క సారలమ్మలను కొలిచి మొక్కులు చెల్లించుకునే ఈ మహోత్సవం వచ్చే ఫిబ్రవరిలో జరగబోతున్నది. ఈ నేపథ్యంలో జాతరను వైభవంగా; తెలంగాణ, గిరిజన సాంస్కృతిక వైభవాన్ని చాటేలా నిర్వహించాలని మంత్రి సీతక్క అధికారులను ఆదేశించారు. జాతర నిర్వహణపై హైదరాబాద్ లో గిరిజన సంక్షేమశాఖ కార్యాలయంలో ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు.

ఇది కూడా చదవండి: TSPSC చైర్మన్‌గా జనార్దన్‌ రెడ్డి రాజీనామా

ఫిబ్రవరిలో జరుగనున్న మేడారం జాతర(Medaram Jatara) ను ఘనంగా నిర్వహించాలని, భక్తులకు సకల సౌకర్యాలు కల్పించాలని మంత్రి సీతక్క అన్నారు. జాతరలో పారిశుధ్యం, రహదారులు, విద్యుత్తు, తాగునీటి లభ్యత, స్నానాల కోసం ఏర్పాట్లు, భక్తుల వసతుల కోసం అంశాలవారీగా అధికారులతో చర్చించి తగిన ఏర్పాట్లు చేయాలని ఆదేశాలిచ్చారు.

గిరిజన సంక్షేమశాఖ నాకు తల్లివంటిది: సీతక్క

గతంలో జాతరకు రెండు నెలల ముందే జరిగే కోయ, గిరిజన ఇలవేల్పుల సమ్మేళనాన్ని ఈ సారి జాతర సమయంలోనే జరిగేలా చూడాలని, తద్వారా భక్తులకు గిరిజన సాంస్కృతిక వైభవాన్ని తెలియజేయాలని సూచించారు. గిరిజన సంక్షేమ శాఖ తన తల్లివంటిదని, ఈ శాఖ ఉద్యోగులు తనను సోదరిలా భావించి తమ సమస్యలను ఎప్పుడైనా చెప్పుకోవచ్చని భరోసా ఇచ్చారు.

జాతీయ హోదా కోసం కృషి

కేంద్ర ప్రభుత్వానికి మరోసారి ప్రతిపాదనలు పంపి మేడారం జాతరకు జాతీయ పండుగ హోదా కోసం కృషి చేస్తామని సీతక్క(Seethakka) అన్నారు. తద్వారా రాష్ట్ర బడ్జెట్ కు కేంద్ర నిధులు తోడై జాతరను మరింత ఘనంగా నిర్వహించుకునే అవకాశం ఉంటుందన్నారు. వచ్చే వారం ఏటూరునాగారంలోని ఐటీడీఏ అధికారులందరితో సమీక్ష నిర్వహించి జాతర ఏర్పాట్లు వేగవంతం చేయాలని ఆదేశించారు.

#telangana #minister-seethakka #mla-seethakka #medaram-jatara
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe