Kishan Reddy: కేంద్రం ఆధ్వర్యంలో తెలంగాణ విమోచన ఉత్సవాలు తెలంగాణ విమోచన ఉత్సవాలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి మరోసారి స్పందించారు. కేంద్రం ఆధ్వర్యంలో తెలంగాణ విమోచన ఉత్సవాలు జరగనున్నాయని కిషన్‌రెడ్డి అన్నారు. ఈ వేడుకకు కేంద్రహోంశాఖ మంత్రి అమిత్‌షాతో పాటు తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర సీఎంలను అహ్వానిస్తామని ఆయన తెలిపారు. By Vijaya Nimma 12 Sep 2023 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి తెలంగాణ సంస్కృతిని అణచివేశారు ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ పాలనపై మరోసారి ఆరోపణలు చేశారు. నిజాం పాలనలో తెలంగాణ సంస్కృతిని అణచివేశారని కిషన్‌రెడ్డి ఆరోపించారు. సెప్టెంబర్ 7 విశిష్టతను జనంలోకి తీసుకెళ్లిన ఘనత బీజేపీదే అన్నారు. ఎన్నో ప్రతిఘటనలను ఎదుర్కొని సెప్టెంబర్ 17న ప్రభుత్వ కార్యాలయాలపై నాటి నుంచి జాతీయ పతాకాలు ఎగురవేశాస్తామని అన్నారు. కేసీఆర్ ఉద్యమ సమయంలో అధికారికంగా సెప్టెంబర్ 17ను నిర్వహిస్తామని చెప్పారు. ఉద్యమ సమయంలో ఇచ్చిన మాటను అధికారంలోకి వచ్చిన తర్వాత కేసీఆర్ విస్మరించారని మండిపడ్డారు. చరిత్ర దాచిపెట్టిన దాగదు కేసీఆర్ MIMకి లొంగిపోయారు.. అవకాశ వాదిగా మారిపోయారని కిషన్‌రెడ్డి ఆరోపించారు. గత ఏడాది సెప్టెంబర్ 17న కేంద్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడంతో కేసీఆర్ ఉలిక్కిపడ్డాడని అన్నారు. కేసీఆర్ సెప్టెంబర్ 17న సమైక్యతా దినంగా ఏ రకంగా నిర్వహిస్తారు..? అని ప్రశ్నించారు. 80 వేల పుస్తకాలు చదివిన కేసీఆర్ .. సెప్టెంబర్ 17న సమైక్యత దినం అని ఏ పుస్తకంలో ఉందో చెప్పాలన్నారు. చరిత్ర దాచిపెట్టిన దాగదని.. కర్ణాటక ప్రభుత్వం అధికారికంగా ఉన్నా.. హైదరాబాద్ ముక్తి దివాస్ పేరుతో సెప్టెంబర్ 17ను నిర్వహిస్తోందన్నారు. తెలంగాణ ప్రభుత్వం సమైక్యత దినంగా నిర్వహించడంపై బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. చేతకాకుంటే ఇంట్లో కూర్చోవాలని... చరిత్రను మాత్రం తప్పుదారి పట్టించవద్దని కేసీఆర్ ప్రభుత్వానికి కిషన్‌రెడ్డి హితవు పలికారు. సెప్టెంబర్ 17న విజయవంతం చేయాలి మజ్లీస్ పార్టీకి జీహుజూర్ అంటూ వాస్తవ విషయాలను వక్రీకరిస్తున్నారని అన్నారు. ఎవరికి మేము వ్యతిరేకం కాదు. గత ఏడాది మాదిరిగా అధికార పూర్వకంగా హైదరాబాద్ లిబరేషన్ డే కొనసాగిస్తాం అన్నారు. హైదరాబాద్ విమోచన వేడుకలను నిర్వహించాలని తెలంగాణలోని ప్రతి గ్రామ సర్పంచ్‌కి ఉత్తరాలు రాస్తున్నామున్నారు. సెప్టెంబర్ 17 బీజేపీ ఫంక్షన్ కాదు... ప్రభుత్వ ఉత్సవం అన్నారు. సెప్టెంబర్ 17న రాష్ట్రపతి నిలయంలో కూడా హైదరాబాద్ విమోచన వేడుకలు జరుగుతాయన్నారు. కొంత మంది ముర్ఖులకు సెప్టెంబర్ 17న గొప్పతనం అర్థం కావటం లేదన్నారు. అమిత్ షా పరేడ్ గ్రౌండ్‌లో పార మిలటరీ బలగాల గౌరవవందనం స్వీకరించి, జాతీయ పతాకం ఎగురవేస్తారని ఆయన పేర్కొన్నారు. అన్ని గ్రామ పంచాయతీల్లో, పాఠశాలలో సెప్టెంబర్ 17 అధికారికంగా నిర్వహించాలని కిషన్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. #celebrations #kishan-reddy #telangana-liberation #under-the-auspices #centre #bjp-state-president మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి