IT Minister KTR :ట్రెండింగ్ లో ఐటీ మినిస్టర్..కేటీఆర్ ని ట్యాగ్ చేస్తూ వెల్లువెత్తుతున్న ట్వీట్లు

బీఆర్ఎస్ ప్రభుత్వం పడిపోయింది. ఐటీ మినిస్టర్ గా కేటీఆర్ రాజీనామా చేశారు. దీంతో నెక్స్ట్ ఐటీ ఎవరు అంటూ ట్రెండ్ నడుస్తోంది. దీంతో పాటూ కేటీఆర్ ని మిస్ అవుతున్నామంటూ పోస్ట్ లు పెడుతున్నారు.

IT Minister KTR :ట్రెండింగ్ లో ఐటీ మినిస్టర్..కేటీఆర్ ని ట్యాగ్ చేస్తూ వెల్లువెత్తుతున్న ట్వీట్లు
New Update

KTR: హైదరాబాద్ వాసులు, ఐటీ పీపుల్ మాజీ ఐటీ మినిస్టర్ కేటీఆర్ ని చాలా మిస్ అవుతున్నారు. తాజా ఎన్నికల్లో కేటీఆర్ గెలిచినప్పటికీ బీఆర్ఎస్ (BRS) ఓడిపోయింది. మంచి మెజార్టీతో కాంగ్రెస్ గెలిచింది. దీంతో తెలంగాణకు కాబోయే ముఖ్యమంత్రి (Telangana CM) ఎవరు అనే విషయం మీద చర్చసాగుతోంది. కాంగ్రెస్ నుంచి ఎవరిని సీఎం చేస్తారని అందరూ మాట్లాడుకుంటున్నారు దీంతో పాటు మరో అంశంకూడా ఇప్పుడు సోషల్‌మీడియాలో హాట్‌ టాపిక్‌గా మారింది. అదే తెలంగాణకు నెక్స్ట్ ఐటీ మినిస్టర్ (Telangana IT Minister) ఎవరు అన్న విషయం. దీని గురించి సోషల్ మీడియాలో చాలానే డిస్కషన్ అవుతోంది. దీంతో పాటూ ఐటీ మినిస్టర్ గా కేటీఆర్ చేసిన సేవలను అందరూ గుర్తు చేసుకుంటున్నారు.

Also Read: ఇస్రో మరో విజయం.. జాబిల్లి కక్ష్య నుంచి భూకక్ష్య దిశగా ప్రొపల్షన్ మాడ్యుల్..

గత పదేళ్ళలో హైదరాబాద్ లోని ఐటీని చాలా అభివృద్ధి చేశారు కేటీఆర్. బోలెడు కంపెనీలు ఇక్కడకు వచ్చాయి...పెట్టుబడులు పెట్టాయి. ఐటీ రంగం పరుగులు పెట్టింది. ఇదంతా కేటీఆర్ కృషే. ఈ విషయం కేవలం హైదరాబాద్ ఐటీ నిపుణులే కాదు...ఇతర రాష్ట్రాల నుంచి వారు కూడా గొప్పగా చెప్పుకుంటున్నారు. దీంతో ఐటీ శాఖ మంత్రిగా కేటీఆర్‌ను (Minister KTR) మిస్ అవుతామని పలువురు కామెంట్ చేస్తున్నారు. కొందరు బీఆర్ఎస్ అభిమానులు అయితే కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా కేటీఆర్ ఐటీ శాఖ మంత్రిగా పనిచేయాలంటూ కామెంట్లు పోస్ట్ చేస్తున్నారు. ఇప్పటివరకు మేం చూసిన బెస్ట్‌ ఐటీ మినిస్టర్‌ మీరే.. తెలంగాణ బెస్ట్‌ ఐటీ మినిస్టర్‌ను కోల్పోయింది. అంటూ కేటీఆర్‌ను ఉద్దేశించి కామెంట్లు పెడుతున్నారు. ఇకపై కేటీఆర్‌ ఐటీ మినిస్టర్‌ కాదని తెలిసి నా ఐటీ జాబ్‌కు రాజీనామా చేస్తున్నామని కొంతమంది ట్వీట్లు చేశారు. ఐటీ మినిస్టర్‌ అనే పదానికి కేటీఆర్‌ రోల్‌ మాడల్‌ అని.. విజినరీ నాయకత్వాన్ని మిస్సవుతున్నామని కామెంట్లు పెడుతున్నారు. హైదరాబాద్‌ ఇంతగా అభివృద్ధి చెందింది.. ఉద్యోగవకాశాలతో లక్షలాది మంది ఇక్కడ జీవిస్తున్నారంటే దానికి కారణం మీరేనంటూ తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. కేటీఆర్‌ను ట్రెండ్‌ సెట్టర్‌ అంటూ కొనియాడుతున్నారు.

మరోవైపు త్వరలోనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్న కాంగ్రెస్ నుంచి ఎవరు ఐటీ మినిస్టర్ అవుతారు అంటూ కూడా చర్చ జరుగుతోంది. ఈ రేసులో ముగ్గురు , నలుగురు ఉన్నారంటూ చర్చ జరుగుతోంది. దుద్ధిళ్ళ శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తదితరుల పేర్లు వినిపిస్తున్నాయి.

#ktr #brs #it-minister-ktr #trending #hyderabad #it-minister
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe