Telangana Intermediate Board : తెలంగాణ ఇంటర్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. నిమిషం ఆలస్యం వచ్చినా పరీక్షా కేంద్రాలకు అనుమతి ఇవ్వబోమనే నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. 5 నిమిషాలు పరీక్షలకు ఆలస్యంగా వచ్చినా విద్యార్థులకు అనుమతి ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు 9 గంటలు దాటితే పరీక్ష రాసేందుకు విద్యార్థులను అధికారులు అనుమతించే వారు కాదు. ఇంటర్ బోర్డు విధించిన ఈ నిబంధన వల్ల సమయానికి పరీక్ష కేంద్రాలకు చేరుకోలేక పోయిన విద్యార్థులు.. పరీక్ష రాయలేకపోయామని నిరాశలో కూరుకుపోయి విద్యార్థులు ప్రాణాలు తీసుకుంటున్నారు. ఇటీవల పరీక్షలకు ఆలస్యంగా వచ్చిన కొందరు విద్యార్థులను అధికారాలు పరీక్ష రాసేందుకు అనుమతించకపోవడంతి సూసైడ్ చేసుకున్నారు. దీంతో ఇంటర్ బోర్డు నిమిషం ఆలస్య నిబంధనను తొలిగించింది.
బస్సులు సమయానికి రాక..
సమయానికి ఆర్టీసీ బస్సులు రాకపోవడంతో ఓ ఇంటర్ విద్యార్ధి తన పరీక్షను మిస్ అయ్యాడు.
నిమిషం ఆలస్యం నిబంధన.. ప్రాణాలు తీసుకున్న శివ కుమార్..
కన్నీళ్లు పెట్టుకున్న ఇంటర్ విద్యార్థిని..
Also Read: స్పెషల్ బీఈడీ చేసిన వారికి లక్కీ ఛాన్స్.. వారికోసం ఎన్ని పోస్టులంటే?