/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/inter-1-jpg.webp)
Telangana Intermediate Board : తెలంగాణ ఇంటర్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. నిమిషం ఆలస్యం వచ్చినా పరీక్షా కేంద్రాలకు అనుమతి ఇవ్వబోమనే నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. 5 నిమిషాలు పరీక్షలకు ఆలస్యంగా వచ్చినా విద్యార్థులకు అనుమతి ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు 9 గంటలు దాటితే పరీక్ష రాసేందుకు విద్యార్థులను అధికారులు అనుమతించే వారు కాదు. ఇంటర్ బోర్డు విధించిన ఈ నిబంధన వల్ల సమయానికి పరీక్ష కేంద్రాలకు చేరుకోలేక పోయిన విద్యార్థులు.. పరీక్ష రాయలేకపోయామని నిరాశలో కూరుకుపోయి విద్యార్థులు ప్రాణాలు తీసుకుంటున్నారు. ఇటీవల పరీక్షలకు ఆలస్యంగా వచ్చిన కొందరు విద్యార్థులను అధికారాలు పరీక్ష రాసేందుకు అనుమతించకపోవడంతి సూసైడ్ చేసుకున్నారు. దీంతో ఇంటర్ బోర్డు నిమిషం ఆలస్య నిబంధనను తొలిగించింది.
బస్సులు సమయానికి రాక..
సమయానికి ఆర్టీసీ బస్సులు రాకపోవడంతో ఓ ఇంటర్ విద్యార్ధి తన పరీక్షను మిస్ అయ్యాడు.
ఆర్టీసీ బస్సులు లేక ఇంటర్మీడియట్ విద్యార్థుల తిప్పలు
సమయానికి పరీక్షకు వెళ్ళలేకపోతున్నాం అంటూ గోడు వెళ్లబోసుకున్న విద్యార్థులు
ఇంటర్మీడియట్ విద్యార్థులు సమయానికి బస్సులు రాక భయాందోళనకు గురవుతున్నారు . ఒక నిమిషం నిబంధనతో విద్యార్థుల భవిష్యత్ తో చెలగాటం ఈ ప్రభుత్వం ఇప్పటికైనా… pic.twitter.com/KVh8XEGk1t
— Telugu Scribe (@TeluguScribe) March 1, 2024
నిమిషం ఆలస్యం నిబంధన.. ప్రాణాలు తీసుకున్న శివ కుమార్..
ఇంటర్ విద్యార్థి ప్రాణం తీసిన ఒక్క నిమిషం ఆలస్యం అనే నిబంధన
ఆదిలాబాద్ - జైనథ్ మండలం మాంగూర్ల గ్రామానికి చెందిన టేకం శివ కుమార్ అనే విద్యార్థి పరీక్ష రాయడానికి రాగా ఒక్క నిమిషం ఆలస్యం అనే నిబంధనతో పరీక్ష కేంద్రంలో అనుమతించలేదు.
దీంతో పరీక్ష రాయలేకపోయాననే మనోవేదనతో సాత్నాల… pic.twitter.com/q3Z6YN2y7V
— Telugu Scribe (@TeluguScribe) February 29, 2024
కన్నీళ్లు పెట్టుకున్న ఇంటర్ విద్యార్థిని..
ఇంటర్ పరీక్షలకు ఆలస్యం.. కంటతడి పెట్టుకున్న అమ్మాయి
జగిత్యాల జిల్లా ధర్మపురిలో ఇంటర్మీడియట్ పరీక్షలకు ధర్మపురి మండలం తిమ్మాపూర్ గ్రామానికి చెందిన విద్యార్థిని పావని 9:09 నిమిషాలకు రాగా.. అధికారులు వెనక్కు పంపించగా అమ్మాయి కంటతడి పెట్టుకుంది. pic.twitter.com/m63GPH9L0l
— Telugu Scribe (@TeluguScribe) February 28, 2024
Also Read: స్పెషల్ బీఈడీ చేసిన వారికి లక్కీ ఛాన్స్.. వారికోసం ఎన్ని పోస్టులంటే?