Telangana: గద్వాలలో బీఆర్‌ఎస్‌కు షాక్‌.. ఎమ్మెల్యేగా బీజేపీ నేత డీకే అరుణ..

గద్వాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డికి షాక్ తగిలింది. ఎమ్మెల్యేగా ఆయనను తెలంగాణ హైకోర్టు అనర్హుడిగా ప్రకటించింది. దీంతో 2018 ఎన్నికల్లో రెండో స్థానంలో నిలిచిన డీకే ఆరుణను ఎమ్మెల్యేగా ప్రకటించింది. గత ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున పోటీచేసిన డీకే అరుణ 73వేల612 ఓట్లతో సెకండ్ ప్లేస్ లో నిలిచింది. అప్పటి టీఆర్ఎస్, ప్రస్తుత బీఆర్ఎస్ అభ్యర్థి బండ్ల కృష్ణమోహన్ రెడ్డి లక్షా 57 ఓట్లు సాధించి గెలుపొందారు.

New Update
Telangana: గద్వాలలో బీఆర్‌ఎస్‌కు షాక్‌.. ఎమ్మెల్యేగా బీజేపీ నేత డీకే అరుణ..

గద్వాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డికి షాక్ తగిలింది. ఎమ్మెల్యేగా ఆయనను తెలంగాణ హైకోర్టు అనర్హుడిగా ప్రకటించింది. దీంతో 2018 ఎన్నికల్లో రెండో స్థానంలో నిలిచిన డీకే ఆరుణను ఎమ్మెల్యేగా ప్రకటించింది. గత ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున పోటీచేసిన డీకే అరుణ 73వేల612 ఓట్లతో సెకండ్ ప్లేస్ లో నిలిచింది. అప్పటి టీఆర్ఎస్, ప్రస్తుత బీఆర్ఎస్ అభ్యర్థి బండ్ల కృష్ణమోహన్ రెడ్డి లక్షా 57 ఓట్లు సాధించి గెలుపొందారు. ఆయన అఫిడవిట్ లో తప్పుడు వివరాలు పొందుపర్చారని, ఆయనను అనర్హుడిగా ప్రకటించాలంటూ కోర్టులో పిటిషన్ దాఖలైంది. విచారణ అనంతరం కృష్ణమోహన్ రెడ్డిని అనర్హుడిగా ప్రకటిస్తూ తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఇటీవల కొత్తగూడెం ఎమ్మెల్యేగా వనమా ఎన్నిక చెల్లందూ తీర్పునిచ్చిన హైకోర్టు.. తాజాగా అలాంటి మరో తీర్పును వెలువరించింది. కొత్తగూడెంకు సంబంధించి హైకోర్టు తీర్పుపై సుప్రీం కోర్టు స్టే ఇవ్వడంతో ప్రస్తుతం కొత్తగూడెం ఎమ్మెల్యేగా వనమా కొనసాగుతున్న విషయం తెలిసిందే. కాగా కృష్ణమోహన్‌ రెడ్డి తప్పుడు అఫిడవిట్‌ దాఖలుచేశారని ఆయనపై వేటు వేసింది తెలంగాణ హైకోర్టు. అలాగే 3 లక్షల జరిమానా విధించింది. అందులోంచి రూ.50 వేలు డీకే అరుణకు ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు రానున్న ఎన్నికల్లోనూ గద్వాల నుంచి టికెట్‌ దక్కించుకున్నారు బండ్ల కృష్ణమోహన్‌ రెడ్డి. ఇటీవల కేసీఆర్‌ బీఆర్‌ఎస్‌ అభ్యర్థుల తొలి జాబితా ప్రకటించగా.. అందులో కృష్ణమోహన్‌ రెడ్డికి చోటు దక్కింది.

డీకే అరుణ గురించి..

గద్వాల నుంచి డీకే అరుణ 2004 నుంచి 2014వరకు జరిగిన ఎన్నికల్లో విజయం సాధిస్తూ వచ్చారు. 2004లో ఇండిపెండెంట్‌ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించిన ఆమె.. 2009, 2014 ఎన్నికల్లో కాంగ్రెస్‌ నుంచి గెలుపొందారు. 2018లోనూ కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసి బీఆర్‌ఎస్‌ అభ్యర్థి కృష్ణమోహన్‌ రెడ్డి చేతిలో ఓటమి చెందారు. ఎన్నికల తర్వాత డీకే అరుణ కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పి బీజేపీలో చేరారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ నుంచి ఎంపీగా పోటీ చేసి రెండో స్థానంతో సరిపెట్టుకున్నారు. ప్రస్తుతం బీజేపీ జాతీయ ఉపాధ్యాక్షురాలిగా ఉన్నారు. కొంతకాలంగా పార్టీలో చురుకుగా వ్యవహరిస్తున్న డీకే అరుణ.. జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు తెచ్చుకుంటున్నారు.

సుప్రీంకు కృష్ణమోహన్ రెడ్డి!

హైకోర్టు తీర్పుపై బండ్ల కృష్ణమోహన్ రెడ్డి సుప్రీంకోర్టుకు వెళ్లే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కృష్ణమోహన్ రెడ్డికి కూడా కోర్టు నుంచి స్టే లభిస్తే.. తన పదవి కాలం ముగిసిపోయే వరకూ ఎమ్మెల్యేగా కొనసాగే ఛాన్స్ ఉంది. ఎన్నికలు దగ్గర పడుతున్న ఈ క్షణంలో హైకోర్టు నుంచి ఇలాంటి తీర్పు రావడంతో అభ్యర్థుల్లో ఉత్కంఠ నెలకొంది.

మరిన్ని వార్తల కోసం చూడండి..

Advertisment
Advertisment
తాజా కథనాలు