Telangana : భూ సమస్యల పరిష్కారానికి త్వరలో కొత్త చట్టం.. ! తెలంగాణలో భూ సమస్యల పరిష్కారానికి ప్రస్తుతం ఉన్న రికార్డ్ ఆఫ్ రైట్స్-2020 చట్టం ఉపయోగపడదని రేవంత్ సర్కార్ భావిస్తోంది. ఈ చట్టం స్థానంలో కొత్త చట్టాన్ని అమల్లోకి తీసుకురావాలని నిర్ణయానికి వచ్చింది. దీనిపై మరింత సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి. By B Aravind 23 Jun 2024 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి Permanent Solution Of Land Problem : తెలంగాణ (Telangana) లో భూ సమస్యల పరిష్కారానికి రేవంత్ సర్కార్ (Revanth Sarkar) కసరత్తులు చేస్తోంది. ప్రస్తుతం ఉన్న రికార్డ్ ఆఫ్ రైట్స్-2020 (ROR) చట్టం.. ఈ సమస్యల పరిష్కారానికి పనిచేయదని భావిస్తోంది. ఆర్‌వోఆర్ చట్టాన్ని మొత్తానికే మార్చేయాలని ఓ నిర్ణయానికి వచ్చింది. అయితే ఈ పాత చట్టం స్థానంలో కొత్త చట్టాన్ని తీసుకొచ్చేందుకు ముందడుగులు వేస్తోంది. ఇందుకోసం అనేక అంశాలను పరిగణలోకి తీసుకోని.. కొత్త రెవెన్యూ చట్టానికి రూపకల్పన చేస్తున్నట్లు తెలుస్తోంది. వచ్చే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ఈ కొత్త చట్టానికి ఆమోదం తెలిపే బిల్లును తీసుకొస్తారనే రెవెన్యూ వర్గాల్లో ప్రచారం నడుస్తోంది. Also Read: హైదరాబాద్ గాంధీ భవన్‌లో ఉద్రిక్తత పాత చట్టం పనికిరాదు బీఆర్‌ఎస్ (BRS) ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ధరణి పోర్టల్ (Dharani Portal) ను తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. అయితే దాన్ని అమల్లోకి తీసుకొస్తున్నప్పుడు అంతకుముందున్న పాత చట్టం స్థానంలో ఆవోఆర్ -2020 చట్టాన్ని అమల్లోకి తీసుకొచ్చారు. ఆ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక.. ధరణి పోర్టల్ పునర్నిర్మాణం కోసం నియమించిన ప్రత్యేక కమిటీ ఈ చట్టాన్ని పరిశీలించింది. చివరికి ఈ చట్టం ద్వారా భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం లభించదని.. దీనివల్ల ఇంకా కొత్త సమస్యలు వస్తున్నాయని అభిప్రాయానికి వచ్చింది. కీలకమైన మార్పులు ఈ కమిటీలోని నిపుణులు పాత చట్టంలో ఎలాంటి సవరణలు చేయాలో వాటి గురించి ప్రభుత్వానికి సిఫార్సులు చేశారు. లేకపోతే పూర్తిగా చట్టాన్ని రద్దు చేసి కొత్త చట్టాన్ని అమల్లోకి తీసుకురావాలని సూచించారు. దీంతో పాత చట్టంలో మార్పులు చేసే బదులు.. కొత్త చట్టాన్ని తీసుకురావడం మేలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించుకుంది. ఈ క్రమంలోనే పాత చట్టంలోని పలు అంశాలను పరిగణలోకి తీసుకొని.. అసవరమైన కీలక మార్పులు చేస్తూ.. రికార్డ్ ఆఫ్ రైట్స్ -2024 చట్టాన్ని రూపొందించేలా అధికారులు కసరత్తులు చేస్తున్నారు. ఈ ముసాయిదా చట్టంలో న్యాయపరంగా అభిప్రాయాలను తీసుకొని రాష్ట్ర కేబినెట్ ఆమోదిస్తారు. ఆ తర్వాత జులైలో జరగనున్న బడ్జెట్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో దీనికి ఆమోదం పొందేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. Also read: తెలంగాణలో విద్యుత్ ఉద్యోగులకు డీఏ పెంపు ప్రస్తుతం రాష్ట్రంలో అమలవుతున్న ఆవోఆర్ చట్టంలో ఎలాంటి మార్పులు జరుగుతాయనే దానిపై ఆసక్తి నెలకొంది. భూ సమస్యల పరిష్కారం కోసం.. పలు స్థాయిల్లోని అధికారులకు ఉండే అధికారాల వికేంద్రీకరణకు సంబంధించి కొత్త చట్టంలో క్లారిటీ రానుంది. అయితే కలెక్టర్లు, ఆర్డీవోలు, తహశీల్దార్లకు ఎలాంటి అధికారాలు ఇవ్వాలి.. ఆయా స్థాయిల్లో ఉన్న అధికారులు ఎలాంటి వాటికి బాధ్యత వహిస్తారనే దానిపై స్పష్టత రానుంది. అలాగే భూ రికార్డుల ప్రక్షాళన సందర్భంగా పాస్ పుస్తకాలు ఇవ్వకుండా పార్ట్-బీలో పెట్టిన 18 లక్షల ఎకరాలు.. సాదాబైనామాల కింద లావాదేవీలు జరిగి పాస్ పుస్తకాలు పొందని 9 లక్షల ఎకరాల భూములకు పరిష్కారం చూపించే దిశలో చట్టాన్ని తీసుకురానున్నట్లు సమాచారం. #telugu-news #telangana-news #land #dharani #ror మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి