Sunksihala Project: సుంకిశాల ప్రమాదం.. మేఘా కంపెనీకి షాకిచ్చిన ప్రభుత్వం సుంకిశాల రిటైనింగ్ వాల్ కూలిన ఘటనపై తెలంగాణ ప్రభుత్వం సీరియస్ అయ్యింది. ప్రాజెక్టు డైరెక్టర్ సుదర్శన్‌పై బదిలీ వేటు వేసింది. మరికొందరు అధికారులను సస్పెండ్ చేసింది. నిర్మాణ సంస్థ అయిన మేఘా కంపెనీకి కూడా షోకాజ్ నోటీసులు జారీ చేసింది. By B Aravind 14 Aug 2024 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి నల్గొండ జిల్లాలో నాగార్జున సాగర్ వద్ద నిర్మిస్తున్న సుంకిశాల ప్రాజెక్టులో రిటైనింగ్ వాల్ కుప్పకూలడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. 2016లో ఈ ప్రాజెక్టును దక్కించుకున్న మేఘా ఇంజినీరింగ్ వైఫల్యమే కారణమని విమర్శలు వస్తున్నాయి. ప్రాజెక్టు పనుల్లో ఆలస్యం జరగడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. పనుల్లో నిర్లక్ష్యం వహించిన ఆ ఏజెన్సీపై చర్యలు తీసుకోవాలని.. ఇప్పటికే మాజీ మంత్రి కేటీఆర్, ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్‌రెడ్డి డిమాండ్ చేశారు. Also Read: నిమ్స్ ఆస్పత్రి కీలక నిర్ణయం.. ఇకనుంచి ఆ చికిత్స ఉచితం ఈ నేపథ్యంలోనే సుంకిశాల ఘటనపై ప్రభుత్వం సీరియస్ అయ్యింది. ప్రాజెక్టు డైరెక్టర్ సుదర్శన్‌పై బదిలీ వేటు వేసింది. ఆయన్ని నాన్ ఫోకల్ పోస్టుకు బదిలీ చేసింది. అలాగే ప్రాజెక్టు కన్‌స్ట్రక్షన్ సర్కిల్ -3 అధికారులపై సస్పెన్షన్ వేటు వేసింది. సీజీఎం కిరణ్ కుమార్, జీఎం మరియా రాజ్, డీజీఎం ప్రశాంత్, మేనేజర్ హరీష్‌ను సస్పెండ్ చేసింది. ఈ మేరకు పురపాలక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ దాన కిషోర్ ఆదేశాలు జారీ చేశారు. సుంకిశాల ప్రమాద ఘటనపై జలమండలి ఉన్నత స్థాయి అధికారులతో కమిటీ ఏర్పాటు చేసిన ఆయన.. కమిటీ రిపోర్టును ప్రభుత్వానికి సమర్పించారు. ఈ నేపథ్యంలోనే విధుల్లో నిర్లక్ష్యం వహించిన అధికారులపై ప్రభుత్వం చర్యలు తీసుకుంది. అలాగే నిర్మాణ సంస్థ అయిన మేఘా ఇంజినీరింగ్ కంపెనీకి కూడా షోకాజ్ నోటీసులు జారీ చేసింది. దీనిపై ఉన్నత స్థాయి విచారణకు సైతం ఆదేశించింది. Telangana: In Nalgonda district, the Nagarjunasagar Dam's water levels reached dead storage, causing a significant accident at the Sunkishala project. Officials kept the incident confidential since no workers were on site at the time pic.twitter.com/JWqf6A6MPf — IANS (@ians_india) August 8, 2024 Also Read: నీకో లక్ష.. బిడ్డకో లక్ష.. ప్రియురాలిని వంచించి.. పెళ్లికి నో చెప్పిన ప్రియుడు..! #telugu-news #telangana #sunkishala-project #sunkishala-retaining-wall మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి