రేవంత్ ప్రభుత్వం మరో హామీ అమలు దిశగా ముందడుగు వేస్తోంది. ఆరు గ్యారెంటీల్లో హామీల్లో భాగంగా ఒక్కో హామీని అమలు చేస్తూ వస్తోంది. ఈ నేపథ్యంలోనే త్వరలో ఎలక్ట్రిక్ స్కూటర్లు అందజేయనున్నట్లు తెలుస్తోంది. 18 ఏళ్లు పైబడిన యువతుల కోసం ఈ పథకం అమలు చేసేందుకు విధివిధానాలను రూపకల్పన చేస్తున్నట్లు సమాచారం. అయితే ఈ పథకానికి ఇంకా ఏమైన షరతులు విధిస్తారా లేదా చదువుకునే అమ్మాయిలందరికీ ఎలక్ట్రిక్ స్టూటర్లు ఇస్తారా అనే దానిపై స్పష్టత లేదు.
Also Read: జాబ్ క్యాలెండర్‌పై అనేక డౌట్లు.. నష్టపోతామంటూ అభ్యర్థులు ఆందోళన!
అలాగే ఇంట్లో ఒక్కరికే ఇస్తారా లేదా ఇద్దరు ముగ్గురు ఉంటే అందరికీ ఇస్తారా అనే విషయాలను కూడా ప్రభుత్వం ఇంకా అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. ఇదిలాఉండగా.. ఆరు గ్యారెంటీల హామల్లో భాగంగా.. ఇప్పటికే మహిళలకు ఉచిత బస్ ప్రయాణం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రైతు రుణమాఫీ, ఆరోగ్య శ్రీ రూ.10 లక్షలకు పెంపు పథకాలను అమలు చేస్తోంది రేవంత్ సర్కార్.
Also Read: త్వరలో 4.50 లక్షల ఇళ్లు.. ఆ భూములను పంచుతాం: మంత్రి పొంగులేటి శుభవార్త