E-KYC : తెలంగాణ(Telangana) లో ప్రస్తుతం రేషన్ కార్డు(Ration Card) ల ఈకేవైసీ(E-KYC) ప్రక్రియ కొనసాగుతోంది. జనవరి 31న ఈ గడువు తేది ముగియనుంది. గత రెండు నెలలుగా రేషన్ షాపుల్లో ఈ కేవైసీని అప్‌డేట్(E-KYC Update) చేస్తునే ఉన్నారు. అయితే ఇప్పటివరకు రాష్ట్రంలో 75.56 శాతం మంది మాత్రమే ఇది పూర్తి చేశారు. ఇంకా 25 శాతం శాతం పూర్తి చేయడంతో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ గడువు తేదీని వచ్చే నెల ఫిబ్రవరి ఆఖరు వరకు పొడగించింది. అంటే ఫిబ్రవరి 29 వరకు ఈ-కేవైసీని పూర్తి చేసుకోవచ్చు.
Also Read: హీరో వెంకటేశ్‌కు నాంపల్లి కోర్టు షాక్.. కేసులు నమోదు!
కేంద్రం నిర్ణయానికి అనుగుణంగా
అసలైన రేషన్ కార్డు లబ్దిదారులను గుర్తించేందుకు జనవరి 31లోగా ఈకేవైసీ పూర్తి చేయాలని గతంలో రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. అయితే దేశవ్యాప్తంగా ఇంకా కోట్లాదిమంది ఈకేవైసీ పూర్తి చేయాల్సి ఉంది. దీంతో కేంద్ర ప్రభుత్వం గడువు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దీంతో కేంద్రం తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా రేవంత్ సర్కార్(Revanth Sarkar) కూడా ఈకేవైసీ గడువును పెంచింది.
100 శాతం పూర్తి చేయాలి
త్వరగా ఈ ప్రక్రియను పూర్తి చేయాలని సూచనలు చేసింది. ఫిబ్రవరి నెలఖారులోగా 100 శాతం ఈకేవైసీ పూర్తయ్యేలా చూడాలని సూచించారు.ఈ మేరకు అన్ని జిల్లాల కలెక్టర్లు, హైదరాబాద్(Hyderabad) ప్రధాన రేషన్ అధికారికి ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డ్‌ల కోసం కూడా చాలామంది ఎదురుచూస్తున్నారు. అయితే ఈకేవైసీ ప్రక్రియ పూర్తైన తర్వాతే కొత్త రేషన్ కార్డులపై నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది.
Also Read: ఇంటర్ పాస్ అయితే చాలు.. టీఎస్‌ఆర్టీసీలో జాబ్ కొట్టే ఛాన్స్! వివరాలివే!