Minister Gangula Kamalakar: బీసీ విద్యార్థుల ఫీజులు ఇకపై ప్రభుత్వమే చెల్లిస్తుంది: మంత్రి గంగుల

New Update
Minister Gangula Kamalakar: బీసీ విద్యార్థుల ఫీజులు ఇకపై ప్రభుత్వమే చెల్లిస్తుంది: మంత్రి గంగుల

తెలంగాణ బీసీ విద్యార్థులు శుభవార్త చెప్పింది ప్రభుత్వం. మన దేశంలోని ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థల్లో చదివే వారికి రాష్ట్ర ప్రభుత్వం ఫీజు చెల్లిస్తుందని తెలిపింది. బీసీ విద్యార్థులు ఫీజలు ఇకపై ప్రభుత్వమే భరిస్తుందని తెలిపారు మంత్రి గంగుల కమలాకర్ (Minister Gangula Kamalakar). బుధవారం ఆయన మీడియాలో మాట్లాడుతూ.. 2023-24 విద్యా సంవత్సరం నుంచే ఫీజు రీయింబర్స్ మెంట్ అమలు చేయాలని బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశంను మంత్రి ఆదేశించారు.

రాష్ట్రంతోపాటు దేశంలోని పలు ప్రతిష్టాత్మక విద్యాసంస్థల్లో సీటు సాధించిన బీసీ విద్యార్ధులందరికీ ఫీజు రియింబర్స్ మెంట్ అమలు అవుతుందని వెల్లడించారు. ఈ స్కీమ్ కి సంబంధించి విధివిధానాలను త్వరలోనే ఖరారవుతాయని చెప్పారు. అలాగే ప్రీ మెట్రిక్ లాగే పోస్టు మెట్రిక్ హాస్టల్ విద్యార్థులకు కూడా సన్నబియ్యం లాంటి సౌకర్యాలు ఇవ్వాలని సీఎం కేసీఆర్(CM KCR) నిర్ణయించారని మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు.

తెలంగాణ రాకముందు బీసీలకు ఉన్నత విద్య అందించడంలో ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహించాయని తెలిపారు. తెలంగాణకు ముందు 19 మాత్రమే బీసీ గురుకులాలు ఉండేవని.. ఇప్పుడు 327 బీసీ గురుకులాలున్నాయని గుర్తు చేశారు. ఇప్పుడు బీసీ విద్యార్థులు చదువుకునేందుకు డిగ్రీ దాకా బీసీ గురుకులాలున్నాయని మంత్రి గంగుల చెప్పారు.

బీసీ విద్యార్థుల ఉన్నత విద్యకు రాష్ట్ర ప్రభుత్వం సహాయం అందించడం సంతోషంగా ఉందని.. బీసీలకు విద్యాప్రధాత సీఎం కేసీఆర్ కాబట్టి కేసీఆర్ పేరుతోనే ఈ స్కీం ఉండాలని కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు. బీసీలు గ్రూప్-1, సివిల్ సర్వెంట్ ఉద్యోగాలు సాధించేలా తీర్చిదిద్దుతున్నారని.. బీసీల పక్షాన ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలుపుతున్నట్లు మంత్రి గంగుల కమలాకర్ వెల్లడించారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు