Telangana : త్వరలో మెగా డీఎస్సీ.. ఏడాదిలో రెండు లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తాం : తమిళిసై అసెంబ్లీలో ప్రసంగించిన గవర్నర్ తమిళిసై.. మెగా డీఎస్సీని నిర్వహించి 6 నెలల్లో ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేస్తామన్నారు. టీఎస్పీఎస్సీ వ్యవస్థ ప్రక్షాళనకు ఇప్పటికే ప్రభుత్వం కార్యాచరణ ప్రారంభించిందని.. ఏడాది లోపు రెండు లక్షల ఉద్యోగ ఖాళీలను భర్తీకి చర్యలు తీసుకుంటామని చెప్పారు. By B Aravind 15 Dec 2023 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి Tamilisai : తెలంగాణలో కొలువుదీరిన కాంగ్రెస్(Congress) ప్రభుత్వానికి గవర్నర్ తమిళసై(Tamilisai) అభినందనలు తెలిపారు. అసెంబ్లీలో ఆమె ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించారు. ' యువతకు మేము ఇచ్చిన ప్రతి మాటా నెరవేర్చుతాం. మెగా డీఎస్సీ నిర్వహించి వచ్చే ఆరు నెలల్లో ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేస్తాం. గత ప్రభుత్వంలో నిరుద్యోగ యువత జీవితాలతో ఆడుకున్న టీఎస్పీఎస్సీ వ్యవస్థ ప్రక్షాళనకు ఇప్పటికే ప్రభుత్వం కార్యాచరణ మొదలుపెట్టింది. ఏడాది లోపు రెండు లక్షల ఉద్యోగ ఖాళీలను భర్తీకి చర్యలు తీసుకుంటామని' తమిళిసై తెలిపారు. Also Read: ఆరు గ్యారెంటీలకు కట్టుబడి ఉన్నాం: గవర్నర్ తమిళిసై ఇదిలాఉండగా.. ఇప్పటికే ప్రశ్నపత్రాల లీకేజీ ఘటనలు భవిష్యత్తులో జరగకుండా చర్యలు తీసుకోవాలని ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఉద్యోగ నియామకాలు, ప్రవేశ పరీక్షలు సమర్థంగా నిర్వహిస్తున్న UPSC తో పాటు ఇతర రాష్ట్రాల పీఎస్సీల పనితీరుపై అధ్యయనం చేసి.. నివేదిక ఇవ్వాలని సూచనలు చేశారు. అలాగే ప్రశ్నపత్రాల లీకేజీతో పాటు పోటీ పరీక్షల నిర్వహణలో వైఫల్యాలపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించననున్నట్లు రేవంత్ పేర్కొన్నారు. అయితే ఇందుకోసం సిట్టింగ్ జడ్జిని కేటాయించేందుకు రాష్ట్ర ఉన్నత న్యాయస్థానానికి లేఖ రాయనున్నట్లు చెప్పారు. Also Read: యశోద ఆసుపత్రి నుంచి కేసీఆర్ డిశ్చార్జ్ #telugu-news #telangana-news #congress #governor-tamilisai #jobs #dsc-job-notification మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి