CM Revanth Reddy: పద్మ అవార్డు గ్రహీతలకు రేపు (ఆదివారం) ఉదయం 11 గంటలకు హైదరాబాద్, శిల్పకళా వేదికలో రాష్ట్ర ప్రభుత్వం సత్కరించనుంది. పద్మ అవార్డ్ గ్రహీతలను సత్కరించనున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, సినీ యాక్టర్ మెగాస్టార్ చిరంజీవి తో పాటు మరో 6 గురు పద్మ అవార్డ్ గ్రహీతలకు సత్కరించనుంది రేవంత్ సర్కార్.
మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు (Venkaiah Naidu), మెగాస్టార్ చిరంజీవికి (MegaStar Chiranjeevi) కేంద్రం పద్మ విభూషణ్ (Padma Vibhushan) ప్రకటించింది. వారితో సహా మొత్తం ఐదుగురిని కేంద్రం పద్మవిభూషణ్‌తో సత్కరించింది. గణతంత్ర దినోత్సవ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఈ ప్రతిష్ఠాత్మక పౌర పురస్కారాలను ప్రకటించింది. పలు రంగాల్లో విశేష సేవలందించిన వారిని గుర్తించి ఈ అవార్డులకు ఎంపిక చేసింది. ఈ ఏడాది మొత్తం 132 మందికి పురస్కారాలు ప్రకటించగా.. ఐదుగురికి పద్మ విభూషణ్, 17 మందికి పద్మభూషణ్, 110 మందికి పద్మశ్రీ అవార్డులు దక్కాయి. దేశ అత్యున్నత పౌర పురస్కారమైన ‘భారతరత్న’ను బిహార్ జననాయక్, మాజీ సీఎం కర్పూరి ఠాకూర్‌కు ప్రకటించిన విషయం తెలిసిందే.
పద్మవిభూషణ్ పురస్కార గ్రహీతలు..
* వైజయంతి మాల బాలి (కళారంగం)- తమిళనాడు
* కొణిదెల చిరంజీవి (కళారంగం)- ఆంధ్రప్రదేశ్
* వెంకయ్యనాయుడు ( ప్రజా వ్యవహారాలు)- ఆంధ్రప్రదేశ్
* బిందేశ్వర్ పాఠక్ ( సామాజిక సేవ)- బిహార్
* పద్మ సుబ్రమణ్యం ( కళారంగం)- తమిళనాడు
విస్మృత యోధులను వరించిన పద్మశ్రీ
మొత్తం 34 మంది అన్ సంగ్ హీరోస్ ను పద్మశ్రీ పురస్కారాలు (Padma Shri Awards) వరించాయి. ఇందులో తెలుగు రాష్ట్రాలకు చెందిన ముగ్గురు కళాకారులు కూడా ఉన్నారు. తెలంగాణలోని జనగామ జిల్లాకు చెందిన యక్షగాన కళాకారుడు గడ్డం సమ్మయ్యకు పద్మశ్రీ పురస్కారం దక్కింది. నారాయణపేట జిల్లా దామరగిద్ద వాసి దాసరి కొండప్పను కూడా పద్మశ్రీ వరించింది. కొండప్ప బుర్ర వీణ వాయిద్యకారుడు. వారితో పాటు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన హరికథా కళాకారిణి ఉమామహేశ్వరికి కూడా పద్మశ్రీ పురస్కారం లభించింది. ఆమెది కృష్ణా జిల్లా మచిలీ పట్నం.
DO WATCH: