TS Teacher Jobs : 5,089 ఉద్యోగాలపై కీలక అప్డేట్.. నిరుద్యోగులకు కేసీఆర్ సర్కార్ శుభవార్త!
తెలంగాణ డీఎస్సీ అభ్యర్థులకు శుభవార్త చెప్పింది విద్యాశాఖ. 5089 టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 20 నుంచి ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు స్వీకరిస్తోంది. రేపటి (అక్టోబర్ 21)తో ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ముగుస్తుంది. ఈనేపథ్యంలో అప్లికేషన్ల గడువును మరికొన్నిరోజులు పొడిగించాలని అభ్యర్థులు విద్యాశాఖకు విజ్ఞప్తి చేశారు. అభ్యర్థుల నుంచి విజ్ఞప్తులను స్వీకరించిన విద్యాశాఖ మరోవారం పాటు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. అక్టోబర్ 21 నుంచి 28వ తేదీ వరకు దరఖాస్తుల ప్రక్రియను పొడిగించింది. ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది విద్యాశాఖ.