Telangana: మరో సంచలన నిర్ణయం తీసుకున్న తెలంగాణ సర్కార్.. అదేంటంటే..

తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలకు భద్రతను తొలగించింది. ఈ మేరకు పోలీస్ శాఖకు ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ ఆదేశాలతో పోలీస్ శాఖ గన్‌మెన్‌లను వెనక్కి పిలిచింది.

New Update
Telangana: మరో సంచలన నిర్ణయం తీసుకున్న తెలంగాణ సర్కార్.. అదేంటంటే..

Telangana: తెలంగాణ నూతన ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలకు భద్రతను తొలగించింది. గన్‌మెన్‌లను వెనక్కి పిలవాలంటూ పోలీస్ శాఖకు ఆదేశాలు జారీ చేసింది ప్రభుత్వం. దీంతో పోలీస్ శాఖ.. వెంటనే మాజీ మంత్రులు, ఎమ్మెల్యేల వద్ద భద్రతను ఉపసంహరించుకుంది. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలకు, మంత్రులకు భద్రతను కేటాయించింది ప్రభుత్వం. అయితే, కొత్త ప్రభుత్వం ఏర్పాటైన నేపథ్యంలో భద్రతపై పునఃసమీక్షించారు. ఎవరెవరికి గన్‌మెన్స్ అవసరం అనే దానిపై ఇంటెలీజెన్స్ అధికారులు సమీక్షిస్తారు. అనంతరం వారు అందించే రిపోర్ట్ ప్రకారం.. అవసరమైన మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలకు భద్రతను కేటాయిస్తారు.

ఇదిలాఉంటే.. తెలంగాణలో కొత్త ప్రభుత్వం కొలువుదీరిన వెంటనే పోలీస్ శాఖలో బదిలీలు చేపట్టిన విషయం తెలిసిందే. కీలకమైన ముగ్గురు కమీషనర్లను మార్చేసింది ప్రభుత్వం. తొలుత ఐపీఎస్ అధికారులను బదిలీ చేసిన ప్రభుత్వం.. తాజాగా ఐఏఎస్ అధికారులను బదిలీ చేసింది.

Also Read:

ఇంత అందంగా అమ్మాయి కూడా అలగదేమో.. క్యూట్ వీడియో అస్సలు మిస్సవ్వొద్దు..!

రైతన్నలకు శుభవార్త.. రూ. 2 లక్షల రుణమాఫీ ఎప్పుడంటే..!

Advertisment
తాజా కథనాలు