Loan Waiver in Telangana: ఎన్నికల మేనిపెస్టోలో పేర్కొన్న మేరకు రైతులకు రూ. 2 లక్షల రుణ మాఫీకి(Loan Waiver) ప్రభుత్వం సిద్ధమైంది. ఇదే అంశంపై సంబంధిత అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) సీరియస్ డిస్కషన్స్ చేస్తున్నారు. దీంతో ఇప్పుడు రాష్ట్రంలో రైతు రుణమాఫి అంశం చర్చనీయాంశంగా మారింది. ఎన్నికల వేళ తాము అధికారంలోకి వస్తే రైతులకు రూ. 2 లక్షల లోపు రుణాలను మాఫీ చేస్తామని కాంగ్రెస్(Congress) హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైంది. సీఎం రేవంత్ రెడ్డి రుణమాఫీ అంశంపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. రుణమాఫీ కోసం వడ్డీతో కలిపి రూ. 36 వేల కోట్లు అవసరం అవుతాయని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇంత పెద్ద మొత్తంలో నిధులు అంటే ప్రభుత్వానికి కాస్త ఇబ్బందిగా మారింది. నిధుల సమీకరణ ఎలాగా? అని ఆలోచనలో పడింది ప్రభుత్వం.
పూర్తిగా చదవండి..Telangana: రైతన్నలకు శుభవార్త.. రూ. 2 లక్షల రుణమాఫీ ఎప్పుడంటే..!
తెలంగాణలో రైతాంగానికి శుభవార్త చెప్పేందుకు సిద్ధమైంది రేవంత్ సర్కార్. రూ. 2 లక్షల రుణమాఫీపై అడుగులు వేసింది. రుణమాఫీకి సంబంధించి అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి. త్వరలోనే బ్యాంకర్లతో అధికారులు చర్చలు జరిపే అవకాశం ఉంది.
Translate this News: